KMR: బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపునకు చెందిన రాజేశ్వరి అనే మహిళ బ్యాంకులో బంగారం కుదువపెట్టి తెచ్చిన రూ. లక్షన్నర నగదును దొంగలు కాజేశారు. స్కూటీ డిక్కీలో డబ్బులు పెట్టి, వసతిగృహంలో పనికి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి డబ్బులు కనిపించలేదు. ఆందోళన చెందిన బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.