TG: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న పిటిషనర్ తరపు న్యాయవాది.. అవి 50 శాతానికి మించకూడదన్నారు. ఎస్టీలకు మాత్రమే షెడ్యూల్ ఏరియాల్లో రిజర్వేషన్లు పెంచుకునే వీలుందన్నారు. ఒకవేళ 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే.. అవి రద్దయ్యే అవకాశం ఉందన్నారు.