KNR: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 92వ జయంతి వేడుకలు చొప్పదండి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ వడ్లురి సరిత, వైస్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ళ మానస హాజరై మాట్లాడుతూ.. బహుజనుల ఐక్యతకు కృషి చేసిన గొప్ప నాయకుడు అని అన్నారు.
NRPT: ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలని వీహెచ్పీ, బజరంగ్ దళ్ నాయకులు పిలుపునిచ్చారు. మక్తల్ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ విజయోత్సవ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఏప్రిల్ 2న పట్టణంలో నిర్వహించే శోభాయాత్రలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
BHPL: కాటారం మండల కేంద్రంలో ఆదివారం BSP వ్యవస్థాపకుడు కాన్షీరాం 92వ జయంతి వేడుకలు బహుజన వర్గాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన నేతలు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ సడవలి మాట్లాడుతూ.. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో బహుజన నాయకులు ఉన్నారు.
KMM: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం పేద కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న ‘రంజాన్ తోఫా’ను కారేపల్లి జామే మస్జీద్ వద్ద పంపిణీ చేశారు. వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
HNK: హనుమకొండలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. పంచాంగ కర్తలు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముహూర్తాలు, పండుగల విషయంలో ప్రజల మనోభీష్టాలు నెరవేరేలా పంచాంగాలను సిద్ధం చేయాలని సూచించారు. పండుగల విషయంలో విభిన్న అభిప్రాయాలు ఉండకూడదని ఎమ్మెల్యే అన్నారు.
SRCL: తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలోని ముదిరాజ్ సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా గుండి పర్ష రాములు, ఉపాధ్యక్షుడిగా చిలుకపెళ్లి ఆకాశం, ప్రధాన కార్యదర్శిగా బరిగల రాజు, క్యాషియర్‌గా కూనవేని వినోద్ కుమార్, కార్యదర్శిగా రాముల బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.
SRD: సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామంలో ముగ్గురు అనాధ పిల్లలకు ఆదివారం గ్రామస్తులు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ మాట్లాడుతూ.. సామాజిక సేవ కర్త చంద్రశేఖర ఆచార్య చొరవతో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ డైరెక్టర్ తిప్పరాజు ప్రసాద్ ప్రతి నెల కడపల్ గ్రామంలో నిరుపేదలకు నిత్యవసరాలను అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మనోహర్ రెడ్డి ఉన్నారు.
NGKL: జిల్లాలో చేపట్టనున్న జన గణన విధులను అధికారులు సిబ్బంది పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో 2027 జన గణనపై జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి విడత శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జన గణన ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా టూరిజానికి ప్రసిద్ధి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యంగా మన్యంకొండ దేవస్థానం పిల్లలమర్రి, గంగాపురం, కోయిలకొండ కోట లాంటివి ఎన్నో ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి మన్యంకొండ 14 కిలోమీటర్ల దూరం, జిల్లా కేంద్రం నుంచి గంగాపురం 21 కిలోమీటర్ల దూరం, జిల్లా కేంద్రం నుంచి కోయిలకొండ హిస్టారికల్ కోట 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
BDK: పాల్వంచ మండలంలోని శ్రీనివాసగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు.
JGL: కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MNCL: బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాకు చెందిన పాన్ షాప్ యజమాని కొట్టే సత్య ప్రకాశ్ (68) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. LV ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది సత్య ప్రకాశ్ కళ్లను సేకరించారు. శోకసంద్రంలోనూ నేత్రదానం చేసి ఇద్దరికి చూపునిచ్చిన ఆ కుటుంబాన్ని స్థానికులు అభినందించారు.
BHNG: భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి, కూతురు గొంతు కోసి దారుణ హత్య చేసింది. కొడుకును కూడా కత్తితో గొంతు కోయడానికి యత్నించగా తప్పించుకుని కేకలు వేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. బాబు కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
HNK: ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో ఫాదర్ కొలంబో 100వ జయంతి వేడుకలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ MLA డా.తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ కొలంబో చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
NLG: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ అమలు చేయబోమని తీర్మానం చేయాలని, రాష్ట్రంలోని కార్మికుల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ నల్గొండ జిల్లా 13వ మహాసభల్లో ఈ డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.