BHNG: భువనగిరిలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించు పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా, 135వ ఉచిత వైద్య శిబిరం కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్ సంయుక్త ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ కార్యాలయం నందు ఆదివారం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంను భువనగిరి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
WNP: పెబ్బేరు మండల పరిధిలోని తోమలపల్లి గ్రామ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి పునర్నిర్మాణం కోసం ఎమ్మెల్యే మేఘారెడ్డి తన సొంత నిధుల నుంచి రెండు లక్షల నగదును తన క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులకు ఆదివారం అందజేశారు. విరాళం అందజేసిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.
మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కంబాలపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం (రేపు) మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా DMHO హాజరుకానున్నట్లు వైద్యాధికారి వెల్లడించారు. ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి సూచించారు.
NZB: కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన గుండెబోయిన శ్రీకాంత్ వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల విలువ గల LOCను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం అందజేశారు. శ్రీకాంత్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్స కోసం ఈ LOCను అందజేశారు.
SRCL: గ్రామాలలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం బొల్లారం, బాలరాజ్ పల్లి, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాలు అందజేశారు.
NLG: మల్లేపల్లి-చింతపల్లి మార్గంలో ఆటో-లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందడం బాధాకరం. దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5 మంది క్షతగాత్రులను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ADB: తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో MP గోడం నగేశ్ ఆదివారం పర్యటించారు. పీఎం జన్మనిధుల నుంచి రూ. 101 లక్షల నిధులతో మంజూరు అయిన బీటీ రోడ్డుకు MP గోడం నగేశ్ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని MP నగేశ్ పేర్కొన్నారు. నాయకులు గంగాధర్ రావు, చంద్రకాంత్, వెంకట స్వామి, భీంరావ్, సంతోష్, నారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.
KMR: మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మల్లికార్జున్ ఇద్దరు కొడుకులు, కోడలు చార్టెడ్ అకౌంటెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఆదివారం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పెద్ద కుమారుడు రమేష్ భార్య ప్రియా కూడా చార్టెడ్ అకౌంటెంట్ పనిచేస్తున్నారు. దీంతో ఆ గ్రామస్థులు కూడా వారిని అభినందిస్తున్నారు.
BHPL: రేగొండ మండలం పోచంపల్లి గ్రామపంచాయతీలో GP కార్యదర్శి జ్యోతి, GP సిబ్బందిని ఆదివారం సర్పంచ్ కేసిరెడ్డి సబిత-ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో వీరి సేవలు అమూల్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డు మెంబర్లు తదితరులు ఉన్నారు.
BHPL: రేగొండ మండలం పోచంపల్లి గ్రామపంచాయతీలో GP కార్యదర్శి జ్యోతి, GP సిబ్బందిని ఆదివారం సర్పంచ్ కేసిరెడ్డి సబిత-ప్రతాప్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో వీరి సేవలు అమూల్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డు మెంబర్లు తదితరులు ఉన్నారు.
BDK: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనాభా గణన–2027 కార్యక్రమాన్ని జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. జనగణనలో భాగంగా మొదటి దశ అయిన గృహాల జాబితా, గృహ వసతుల గణనపై జిల్లా ఇన్‌ఛార్జ్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
VKB: కొడంగల్ మండల పలుగు రాళ్ల తండాలో సర్పంచ్ మోతిలాల్ నాయక్ గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సెక్రెటరీలను సన్మానించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
KNR: జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు 35 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ వ్యక్తి రైల్వే పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు దూసుకెళ్లి తల, శరీరం వేర్వేరుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: గ్రామాల అభివృద్దే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పని చేస్తున్నదని చెన్నారావుపేట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ అన్నారు. నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి సహకారంతో అక్కల్చెడ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి NREGS నిధులు మంజూరయ్యాయన్నారు. స్థానిక సర్పంచ్ బుజ్జి సురేష్‌తో కలిసి గోపాల్ నాయక్ కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులు ప్రారంభించారు.