SRPT: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి అండగా ఉందని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ నియోజక వర్గం పరిధిలోని 277 మంది లబ్దిదారులకు రూ. 2 కోట్ల 77 లక్షల విలువగల కల్యాణ లక్ష్మీ & షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.