KNR: కేశవపట్నం గ్రామంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే. ప్రభాకర్ పాల్గొని కార్మికుల సేవలను ప్రశంసించారు. అనంతరం డా. గొట్టే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.