• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

దహెగాం తహాసీల్దార్ ఎదుట నిందితుడి బైండోవర్

ASF: దహెగాం మండలంలోని కర్జి గ్రామానికి చెందిన కాటెల కమలాకర్‌ను తహాసీల్దార్ మునవార్ షరీఫ్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై విక్రమ్ శనివారం ప్రకటనలో తెలిపారు. గ్రామంలో మద్యం తాగి గొడవలకు పాల్పడుతున్నందున సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేశామని పేర్కొన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

March 14, 2026 / 12:44 PM IST

ఇంటి పన్ను మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని 19 వేల మొండి బకాయిదారులకు ఆర్పీల ద్వారా అధికారులు రెడ్ నోటీసులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెలాఖరుతో పన్ను చెల్లింపు గడువు ముగుస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు మెప్మా ఆర్పీల సేవలను తీసుకుని బకాయిదారుల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేస్తూ సంతకాలు తీసుకుంటున్నారు.

March 14, 2026 / 12:41 PM IST

టీకాలతోనే చిన్నారులకు రక్షణ: సుబ్బలక్ష్మి

GDWL: చిన్నారులను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు సకాలంలో టీకాలు వేయించాలని హెల్త్ సూపర్వైజర్ సుబ్బలక్ష్మి సూచించారు. శనివారం గద్వాల పాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో టీకాల కార్యక్రమం నిర్వహించారు. పుట్టినప్పటి నుంచి టీకాలు వేయించడం ద్వారా పోలియో, టీబీ, హెపటైటిస్-బి వంటి వ్యాధులను అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు.

March 14, 2026 / 12:41 PM IST

నాణ్యంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం

NGKL: ఉప్పునుంతల మండలంలోని తిప్పాపూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు సర్పంచ్ రాజపుత్ర మహేశ్ సింగ్ శనివారం భూమి పూజ చేశారు. భవన స్లాబ్ నిర్మాణ పనులను వార్డు సభ్యులతో కలిసి పరిశీలించిన ఆయన, పనులు అత్యంత నాణ్యతతో ఉండాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రయ్య యాదవ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 14, 2026 / 12:35 PM IST

పదవ తరగతి విద్యార్థులకు ఆటోలు ఏర్పాటు

KMM: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు వెళ్ళేందుకు కాంగ్రెస్ నాయకులు పెండ్ర అంజయ్య, వజ్ర హాస్పిటల్ డాక్టర్ నాగరాజు కలిసి శనివారం ఆటోలు ఏర్పాటు చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులు పరీక్షలకు వెళ్ళేందుకు ఎలాంటి ఇబ్బందులు పడోద్దనే ఆలోచనతో ఆటోలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

March 14, 2026 / 12:34 PM IST

నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: అదనపు కలెక్టర్

NRML: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాలనీలో నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో వారు పర్యటించారు. అనంతరం పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, కౌన్సిలర్లు ఉన్నారు.

March 14, 2026 / 12:34 PM IST

వృద్ధురాలు మృతిపై కేసు నమోదు

MNCL: మందమర్రిలో ఈ నెల 12న లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో గడప తట్టుకొని కింద పడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పర్స రమేష్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న మృతురాలు రెండు పిల్లులను పెంచుకొంటుందని, కిందపడి ఉన్న మృతురాలి చేతిని పిల్లులు లాగే క్రమంలో రక్తం వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు.

March 14, 2026 / 12:33 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

NZB: ఆర్మూర్ పట్టణంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్ పిప్రి గ్రామానికి చెందిన ఒకరు, భీమల్‌కు చెందిన మరో వ్యక్తితో స్కూటీపై వెళ్తుండగా అతివేగంతో వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు స్థానిక బార్లో పనిచేస్తున్నట్లు సమాచారం.

March 14, 2026 / 12:32 PM IST

మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ శ్రేణుల ఆర్థిక సాయం

MLG: గోవిందరావుపేట మండలం రంగాపూర్ గ్రామానికి జెజ్జరి రామక్క ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళి అర్పించి, వారికి రూ. 3000 ఆర్థికసహాయం అందజేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.

March 14, 2026 / 12:31 PM IST

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి: మంత్రి

SDPT: పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం హైదరాబాద్ శాంతినగర్ పశు వైద్య శాలలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పశువులకు సోకే గాలికుంటు వ్యాధుల వల్ల పశువుకు జ్వరం రావడం వల్ల పాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, కావున రైతులు గాలికుంటు టీకాలు వేయించాలని కోరారు.

March 14, 2026 / 12:24 PM IST

చెన్నకేశవపురంలో టీకా కార్యక్రమం ప్రారంభం

SRPT: నడిగూడెం మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో శనివారం అంగన్‌వాడీ కేంద్రం వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రోగ నిరోధక టీకా’ల కార్యక్రమాన్ని సర్పంచ్ గోసుల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత టీకా సౌకర్యాన్ని గ్రామస్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 14, 2026 / 12:22 PM IST

పశువులు, గొర్రెలకు టీకాల కార్యక్రమం

SRCL: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీ మాచెట్టి లచ్చయ్య ఆధ్వర్యంలో పశువైద్య టీకాల కార్యక్రమం నిర్వహించారు. 75 గేదెలు, ఆవులకు గాలికుంటు టీకాలు, 1500 గొర్రెలకు అమ్మతల్లి టీకాలు, 36 వీధి కుక్కలకు రేబిస్ టీకాలు వేశారు. ఉపసర్పంచ్ గాడిచర్ల శ్రీనివాస్, మపవ  అబ్దుల్ వాజిద్, వీఏఎస్ డాక్టర్ నిఖిల, జేవీఓ సుజాత, గోపాలమిత్రలు భాస్కర్ పాల్గొన్నారు.

March 14, 2026 / 12:22 PM IST

ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక

VKB: కొండగల్ మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం తరఫున ఇబ్రహీం మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ‘సర్వమత సారం ఒక్కటే, మనుషులంతా సోదర భావంతో ఉండాలి’ అని ఛైర్మెన్ పేర్కొన్నారు. తహశీల్దార్ రాంబాబు, TPCC సభ్యుడు MD. యూసుఫ్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 12:22 PM IST

అదృశ్యమైన బాలుడు.. వైరా పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం

BDK: అశ్వాపురం ప్రాంతానికి చెందిన తాటి భువన్ చందు అనే బాలుడు ఇటీవల అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల అభ్యర్థనతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం వైరా పోలీసల అదుపులో ఉన్నట్లు అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

March 14, 2026 / 12:21 PM IST

పదో తరగతి పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన ఏసీపీ

MDCL: సూరారం (M) పరిధిలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏసీపీ బాల గంగిరెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సూరారం పీఎస్ పరిధిలో జరుగుతున్న పరీక్షల సరళిని, భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఏసీపీ వెంట సూరారం సీఐ సుధీర్ కృష్ణ పాల్గొన్నారు.

March 14, 2026 / 12:20 PM IST