• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు: కలెక్టర్

GDWL: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పలు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. జిల్లా ఎస్సీ సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ పథకాలు అమలు కానున్నాయి. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 14, 2026 / 01:18 PM IST

నర్సరీని పరిశీలించిన అధికారులు

MBNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజాపూర్ మండల కేంద్రంలోని నర్సరీని అధికారులు, సర్పంచ్ కావలి రామకృష్ణ శనివారం పరిశీలించారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవి ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 14, 2026 / 01:17 PM IST

భారత ప్రభుత్వ టెలికం కమిటీ సభ్యుడిగా నీరజ్

NRPT: భారత ప్రభుత్వ టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులైన అడ్వకేట్ పసుల నీరజ్‌ను శనివారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో ఈ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకాల డిప్యూటీ సర్పంచ్ విజయ్, వెంకటేశ్వర రెడ్డి, బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 01:14 PM IST

నరకప్రాయంగా అన్నసాగర్-సల్బత్తాపూర్ ప్రయాణం

VKB: కోట్‌పల్లి మండలంలోని అన్నసాగర్ నుంచి సల్బత్తాపూర్ వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు పడటంతో అటుగా వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ మార్గంలో ప్రయాణం ‘కత్తి మీద సామే’ అని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

March 14, 2026 / 01:14 PM IST

ఆ పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించే ఈ వలసలు

HYD: నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో RR జిల్లాకు చెందిన 50 మందికి పైగా BRS నాయకులు BJPలోకి చేరారు. వారికి BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS అస్తిత్వం కోల్పోయిందని, ఆపార్టీకి భవిష్యత్ లేదని గ్రహించే BJPలోకి చేరుతున్నారన్నారు.

March 14, 2026 / 01:11 PM IST

ఎన్నికల హామీ.. ‘వివాహ కానుక’ అందజేత

KNR: సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏలూరు మధుకర్ రెడ్డి కుమార్తె సంగీత వివాహానికి గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్ శనివారం రూ.2,000 వివాహ కానుకను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అశోక్, రాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

March 14, 2026 / 01:04 PM IST

రోజురోజుకు భారీగా పెరుగుతున్న చికెన్ ధరలు

HYD: ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ. 325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ. 286గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు.

March 14, 2026 / 01:01 PM IST

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ

ADB: గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్ వంటి పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతుల కృషి చేస్తానని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.

March 14, 2026 / 01:01 PM IST

మహాసభల సన్నాహక సమావేశంలో జిల్లా నేతలు

WNP: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి జిల్లా నాయకులు శనివారం మహబూబ్ నగర్ తరలివెళ్లారు. అంబేద్కర్ కళాభవన్‌లో జరిగే ఈ సభలో జిల్లా అధ్యక్షుడు ఎస్.అజయ్, సీపీఎం నేతలు మహమూద్, గోపి, కౌన్సిలర్ మాధవి రాజేందర్ తదితరులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

March 14, 2026 / 12:54 PM IST

పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎంపీడీవో

NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల పరీక్షల పర్యవేక్షణ అధికారితో పాటు పోలీసు అధికారులకు సూచించారు.

March 14, 2026 / 12:49 PM IST

‘సీఐ చేతుల మీదుగా కొత్త మొబైల్ షాప్ ప్రారంభం’

BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని మార్కెట్ రోడ్‌లో శృతి, కార్తీక్‌లు నూతనంగా ఏర్పాటు చేసిన SS సత్య మొబైల్ షాప్ను అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని అతిథులను ఆహ్వానించి శుభాకాంక్షలు అందుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజువారీ జీవితంలో ఎంతో ముఖ్యమైందని తెలిపారు.

March 14, 2026 / 12:48 PM IST

ఈ-వ్యర్థాల తొలగింపును పరిశీలించిన ఆర్‌ వి. కర్ణన్

RR: పహాడీషరీఫ్‌లో ఈ-వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి. కర్ణన్ పరిశీలించారు. అనంతరం ఈద్గాను సందర్శించి ప్రాంగణం, పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు. రాబోయే రంజాన్ పండుగ దృష్ట్యా ఈద్గాను సందర్శించే భక్తులకు సరైన పారిశుద్ధ్యం, ప్రజా సౌకర్యాన్ని నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

March 14, 2026 / 12:47 PM IST

రాష్ట్రాభివృద్ధిలో డీలర్స్ పాత్ర కీలకం: నాగుర్ల

WGL: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తేనే డీలర్స్‌ను ఎక్కువగా నమ్ముతారని, రాష్ట్రాభివృద్ధిలో డీలర్స్ పాత్ర కీలకమని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్& సీడ్స్,డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. శివనగర్‌లో నేడు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని సన్మానించారు.

March 14, 2026 / 12:47 PM IST

ఈనెల 17న ఇంటర్వ్యూ.. ఆర్టీసీ KNR RM

KNR: ఆర్టీసీ KNR రీజియన్‌లోని టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిషిప్‌కు FEB 24, 2026 వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా FEB 17న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు కరీంనగర్ ఆర్టీసీ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరు కావాలన్నారు.

March 14, 2026 / 12:46 PM IST

స్కూల్ ప్రహరీ గోడ ధ్వంసం

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో గోడ ధ్వంసం కాగా, సుమారు రూ.70 వేల నష్టం వాటిల్లిందని హెచ్‌ఎం శ్రీధర్ తెలిపారు. పాఠశాల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో, సర్వీస్ రోడ్డులోని షాపులో కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్ఎం పేర్కొన్నారు.

March 14, 2026 / 12:45 PM IST