NZB: ఆర్మూర్ పట్టణంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్ పిప్రి గ్రామానికి చెందిన ఒకరు, భీమల్కు చెందిన మరో వ్యక్తితో స్కూటీపై వెళ్తుండగా అతివేగంతో వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు స్థానిక బార్లో పనిచేస్తున్నట్లు సమాచారం.