• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలి’

JGL: ధర్మపురి పట్టణంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ మాట్లాడుతూ.. దక్షిణ కాశిగా పేరుగాంచిన ధర్మపురికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. పట్టణంలో చెత్తను నిల్వ చేసేందుకు డంప్ యార్డ్ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ దుర్వాసన వస్తుందన్నారు.

March 16, 2026 / 07:30 PM IST

ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన

NRML: బైంసా పట్టణంలోని జీపీఎల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు, సింగిల్ యూసేజి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాస్త్రవేత్త బీ. తిరుపతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

March 16, 2026 / 07:30 PM IST

‘విద్యారంగానికి 30 శాతం నిధులు ఇవ్వాల్సిందే’

KNR: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలైన ఉచిత ఇంటర్నెట్, స్కూటీలు, ల్యాప్‌టాప్ల ఊసే లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు.

March 16, 2026 / 07:29 PM IST

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ MLA

MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్నేహ శబరీష్‌ను సోమవారం డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, కురవి మండల BRS సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ను మాజీ MLA కోరారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.

March 16, 2026 / 07:29 PM IST

ఆసిఫాబాద్‌లో 3 రోజుల పీఎం విశ్వకర్మ ప్రదర్శన

ఆసిఫాబాద్‌లోని తాటియా గార్డెన్‌లో నిర్వహించిన 3 రోజుల ‘పీఎం విశ్వకర్మ’ వాణిజ్య ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ హస్తకళలను ప్రదర్శించారు. జిల్లా పరిశ్రమల అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, చేతివృత్తుల వారికి మార్కెటింగ్, సాంకేతికతపై అవగాహన కల్పించారు. దీనివల్ల స్థానిక కళాకారులకు ఆర్థిక చేయూత లభిస్తుందన్నారు.

March 16, 2026 / 07:21 PM IST

నెక్కొండలో రేపు సామాజిక తనిఖీ ప్రజావేదిక

WGL: నెక్కొండ MPDO కార్యాలయంలో మంగళవారం(రేపు) 39 గ్రామపంచాయతీల పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి చేపట్టిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా MPDO లావణ్య మాట్లాడుతూ.. అన్ని గ్రామాల సర్పంచులు, GP కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

March 16, 2026 / 07:20 PM IST

విద్యార్థుల ఇంగ్లీష్ ఉచ్చారణను పరీక్షించిన కలెక్టర్

KMM: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం వైరా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కొణిజర్ల మండలం చిన్నమునగాల పాఠశాలలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని తనిఖీ చేసి, విద్యార్థుల ఇంగ్లీష్ ఉచ్చారణను స్వయంగా పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల స్థానంలో నూతన తరగతి గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

March 16, 2026 / 07:20 PM IST

ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

BHPL: నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఇవాళ కాటారం డివిజన్ పరిధిలోని BRS పార్టీ సర్పంచులతో మాజీ ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అనునిత్యం గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

March 16, 2026 / 07:19 PM IST

సీతారాముల కల్యాణ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

SRCL: వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆహ్వాన పత్రికను భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో రమాదేవి భక్తుల సమక్షంలో విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

March 16, 2026 / 07:18 PM IST

పాఠశాల అటెండర్‌కు 20 ఏళ్ల శిక్ష విధింపు

MDK: రేగోడు మండలంలో పాఠశాల విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన అటెండర్ సారా జైపాల్ (25)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సుబావల్లి తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2019లో జరిగిన సంఘటనలో నేరం రోజు కావడంతో కఠిన కారాగార శిక్ష విధించారన్నారు. అలాగే బాధితురాలికి రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు ఎస్పీ వివరించారు.

March 16, 2026 / 07:16 PM IST

కామారెడ్డిగూడెంలో ఇఫ్తార్ విందు

JN: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలోని మస్జిద్‌లో సోమవారం సాయంత్రం సర్పంచ్ చింత ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని మతాలు సర్వసమానంగా జీవిస్తున్నాయని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా, షాదీ ముబారక్, మైనారిటీ రుణాలు అందించేవారని కొనియాడారు.

March 16, 2026 / 07:16 PM IST

మద్యం తాగి వాహనం నడిపితే శిక్ష తప్పదు: సీఐ

WGL: నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 26 మందిని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు ట్రాఫిక్ సీఐ సుజాత తెలిపారు. ఇద్దరికి రూ.1000 జరిమానాతో పాటు 3 రోజుల సామాజిక సేవ, మిగిలిన 24 మందికి రూ.36,500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్ష తప్పదని హెచ్చరించారు.

March 16, 2026 / 07:16 PM IST

ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరైన శివసేనారెడ్డి

WNP: వనపర్తి మండలం పెద్దతాండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, సర్పంచ్ కాట్రావత్ ధానమ్మ బుచ్యానాయక్‌తో కలిసి హాజరయ్యారు. లబ్ధిదారులైన శాంతమ్మ పూర్వ నాయక్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

March 16, 2026 / 07:09 PM IST

సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయశాఖ పరిశీలకుడు సత్యనారాయణ సమక్షంలో నిర్వహించారు. గత 6 నెలల కాలంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ. 3,85,202 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ రామారావు, ఈవో సుధాకర్, అర్చకులు వంశీధరాచార్యులు, నవీన్ శర్మ, పాల్గొన్నారు.

March 16, 2026 / 07:07 PM IST

నో స్టాక్ బోర్డు.. వినియోగదారులు ఆగ్రహం

BDK: మణుగూరు ఇండేన్ గ్యాస్ బ్రాంచ్‌లో గ్యాస్ లేదని అధికారులు నో స్టాక్ బోర్డును పెట్టారు. దీంతో స్థానిక వినియోగదారులు ఈగ్రహం వ్యకతం చేస్తున్నారు. ఓ పక్క ఉన్నతాధికారులు నిలువలు అందుబాటులోనే ఉన్నాయి, పుకారులు నమ్మొద్దని అనడం దేనికి సంకేతమని గ్యాస్ వినియోగదారులు వాపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

March 16, 2026 / 07:01 PM IST