• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘రైతు భరోసాకు కొత్త రైతులు దరఖాస్తు చేసుకోండి’

MBNR: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా పట్టా పాస్ బుక్కులు పొందిన రైతులు ‘రైతు భరోసా’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏవో సుజాత సూచించారు. మార్చి 25 లోపు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ వివరాలతో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 17, 2026 / 12:26 PM IST

పశువులకు గాలికుంటు టీకాలు పంపిణీ

PDPL: రామగిరి మండలం పన్నూర్‌లో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని మంగళవారం సర్పంచ్ చిందం మహేష్ ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ మండల అధికారి డా. కళ్యాణి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆవులు, గేదెలకు టీకాలు వేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు పశువులను వ్యాధుల నుంచి రక్షించేందుకు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.

March 17, 2026 / 12:24 PM IST

జమ్ములమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

GDWL: వడ్డేపల్లి మున్సిపల్ ఛైర్మన్ మంజుల మంగళవారం జమ్మిచేడు సమీపంలోని జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో పురేందర్ కుమార్ ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.

March 17, 2026 / 12:21 PM IST

రైల్వే లైన్ బాధితులతో సమావేశం

SRCL: వేములవాడలో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ బాధితులతో సోమవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ల్యాండ్ అక్యువేషన్ అధికారి వెంకటేశ్వర్, వేములవాడ ఆర్డీవో రాధాబాయిలు పాల్గొన్నారు. పరిహారం, పునరావాసంపై బాధితులు అభ్యంతరాలు, డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

March 17, 2026 / 12:16 PM IST

గ్యాస్ బుకింగ్ కోసం తీవ్ర ఇబ్బందులు

KNR: ముస్తాబాద్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీల ముందు క్యూ లైన్ కడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాతే రావాలని గ్యాస్ ఏజెన్సీ వాళ్లు చెబుతుండడంతో, అటు గ్యాస్ బుకింగ్ చేస్తున్న బుకింగ్ కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 17, 2026 / 12:10 PM IST

గ్యాస్ బుకింగ్ కోసం తీవ్ర ఇబ్బందులు

KNR: ముస్తాబాద్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీల ముందు క్యూ లైన్ కడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాతే రావాలని గ్యాస్ ఏజెన్సీ వాళ్లు చెబుతుండడంతో, అటు గ్యాస్ బుకింగ్ చేస్తున్న బుకింగ్ కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 17, 2026 / 12:10 PM IST

ట్రాఫిక్ సమస్యపై పరిశీలన

MDCL: అల్వాల్ సర్కిల్ మల్లారెడ్డి కాలనీలో తీవ్ర ట్రాఫిక్ రద్దీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు చంద్రపురం కాలనీ ద్వారా వెళ్లే ప్రత్యామ్నాయ రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని కాలనీ వాసులు కోరారు.

March 17, 2026 / 12:07 PM IST

హజ్ క్యాంపును సందర్శించిన DM&HO

KMR: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హజ్ సందర్శనార్థం యాత్రికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని DMHO డా.రవీందర్ గౌడ్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుతో కలిసి నేడు సందర్శించారు. యాత్రికుల రక్త నమూనాలను సేకరించి, యాత్రికుల ఆరోగ్య స్థితిగతుల నిర్ధారణ కోసం ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

March 17, 2026 / 12:06 PM IST

‘నేతలతో ప్రిన్సిపల్ ప్రెస్ మీట్ కరెక్ట్ కాదు’

HYD: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.ఖాసిం రాజకీయ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కళ్యాణ్ నాయక్ ఖండించారు. ఒక విద్యా సంస్థలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం నియమావళికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇది అనవసర వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

March 17, 2026 / 12:04 PM IST

‘రైతు భరోసా కోసం దరఖాస్తులు సమర్పించాలి’

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ పరిధిలో ఉన్న కొత్త రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ఏఈఓ త్రిసంధ్య కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం సంవత్సరానికి ఎకరాకు రూ. 12వేల రైతు భరోసా పెట్టుబడి సహాయం అందజేస్తుందన్నారు. ఫిబ్రవరి 28 లోపు కొత్త పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, ఆర్ఓఆర్ ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

March 17, 2026 / 12:02 PM IST

నాగల్ కడుమూర్‌లో నూతన సీసీ రోడ్లకు భూమిపూజ

WNP: అమరచింత మండలం నాగల్ కడుమూర్‌లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొత్త సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో 7వ వార్డులో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహేందర్ రెడ్డి, అరుణ్ కుమార్, గ్రామ పెద్దలు పాల్గొని అభివృద్ధి పనుల వేగవంతంపై చర్చించారు.

March 17, 2026 / 12:01 PM IST

‘రైతులందరూ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోండి’

KMR: జుక్కల్ మండలం హంగర్గ రైతు వేదికలో రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని AEO నాందేవ్ కోరారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రైతులు తమ వెంట ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు. అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 17, 2026 / 11:58 AM IST

రైతుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

KMM: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నియోజకవర్గ కేంద్రంలోని సాగు భూములను సందర్శించి, నేరుగా రైతులను వారి పొలాల వద్దే కలిశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, పంటల పరిస్థితి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులపై వారితో చర్చించారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

March 17, 2026 / 11:52 AM IST

రైతుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

KMM: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నియోజకవర్గ కేంద్రంలోని సాగు భూములను సందర్శించి, నేరుగా రైతులను వారి పొలాల వద్దే కలిశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, పంటల పరిస్థితి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులపై వారితో చర్చించారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

March 17, 2026 / 11:52 AM IST

అజ్మీర గోవింద్ నాయక్ సేవలు మరువలేనివి: ఆత్రం సుగుణ

ADB: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్ నియోజకవర్గానికి చేసిన సేవలు మరువలేనివని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. గోవింద్ నాయక్ మృతి పట్ల ఆమె ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఉట్నూర్ మండలంలోని గోవింద్ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల కోసం అంకితభావంతో సేవలందించిన ప్రజానాయకుడని కొనియాడారు.

March 17, 2026 / 11:50 AM IST