VKB: బొంరాస్‌పేట మండలంలోని 35 గ్రామపంచాయతీలకు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు MPDO వెంకన్ గౌడ్ తెలిపారు. నేటి నుంచి 18 వరకు అలాగే, 23 నుంచి 24 వరకు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామాల వారీగా ఈ శిక్షణలు జరగనున్నాయని చెప్పారు. వార్డు సభ్యులంతా హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
SRCL: రుద్రంగి మండలం రూప్లా నాయక్ తండాకు చెందిన భానోత్ దిలీప్ నాయక్ చత్తీస్‌ఘఢ్ రాజ్య గ్రామీణ బ్యాంక్ క్లర్క్‌గా ఎంపికయ్యాడు. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన ఆయన తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. యువతకు ఆదర్శంగా నిలిచిన దిలీప్‌ను పలువురు అభినందించారు.
MBNR: మిడ్జిల్ మండలం వెలుగోములలో గ్రామపంచాయతీలో ఆదివారం మల్టీపర్పస్ వర్కర్లను సర్పంచ్ సువర్ణమ్మ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామాభివృద్ధిలో వారి సేవలను సర్పంచ్, కార్యదర్శి వినీల కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మమ్మ, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ADB: ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో నేటి నుంచి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్దతు ధరతో కందుల కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పీఏసీఎస్ సీఈవో సునీల్ తెలిపారు. కావున రైతులు తమ కంది పంటను 12 శాతం మాయిశ్చర్ వచ్చే వరకు ఆరబెట్టి, చెత్త చెదారం, పుచ్చులు లేకుండా చేసి నాణ్యమైన సరుకును మార్కెట్ యార్డ్‌కు తీసుకురావాలని సూచించారు.
BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేపు నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం ప్రకటించారు. గిరిజనులు తమ తమ సమస్యలు లిఖితపూర్వకంగా అధికారులకు అందజేయాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు సమావేశ మందిరంలో యూనిట్ అధికారులు హాజరవ్వాలని ఆదేశించారు.
WGL: సంగెం మండల కేంద్రంలోని మజీద్‌లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆదివారం జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావం, సహనం, ఐక్యతకు ప్రతీకగా ఉంటుందని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు.
NGKL: బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో మెయిన్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామచంద్రయ్య (50) మెయిన్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.
KMM: సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ రిహానా కమల్ భాష వార్డు కౌన్సిలర్ హకీమ్ ఆదివారం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతి, సహనం, ప్రేమ వంటివి రంజాన్ మాసంలో వెల్లువిరుస్తాయని చైర్‌పర్సన్ తెలిపారు. మైనారిటీ ప్రజల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు.
KNR: మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను ఉద్యమకారుల జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ బోగే పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే కమిటీని ఏర్పాటు చేసి, తమ డిమాండ్లు నెరవేర్చేలా చొరవ చూపాలని వారు కోరారు.
RR: మూసీ నది గర్భంలోకి ఆదిత్య బిల్డర్స్ నిర్మాణాలు వచ్చాయన్న అనుమానంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గండిపేట తహసీల్దార్‌కు లేఖ రాశారు. గతంలో హైకోర్టు అనుమతులు ఇచ్చినా, శాటిలైట్ చిత్రాల ఆధారంగా వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు రెవెన్యూ నివేదిక కోరారు. నివేదిక అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నది పరివాహక ప్రాంత రక్షణలో భాగంగా ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
HYD: సాయిబాబా దేవాలయం ఎదుట ఓ వ్యక్తిని కిరాతకంగా కత్తులతో నరికి చంపిన ఘటన HYD ఉప్పల్ పరిధి చిలుకా నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. కత్తులతో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ వార్త ఉప్పల్ పరిసర ప్రాంత ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కత్తులతో జరిగిన దాడి వెనుక ఎవరున్నారు..? కారణాలేంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.
BDK: రామవరం 15వ డివిజన్ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి దంత, కంటి, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లల, ఎముకల, గైనకాలజీ విభాగానికి చెందిన ఆరుగురు నిపుణులైన వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహిస్తారు.
KMM: మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి మేరకు త్వరలోనే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మత్కేపల్లి మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రఘునాథపాలెం రైతు వేదికలో ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద యంత్రాలను మంత్రి పంపిణీ చేశారు.
NZB: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మొత్తం రూ. 7.20 లక్షల విలువైన మూడు లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాలను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. తమకు ప్రాణభిక్ష పెట్టిన ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
HNK: మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా DMHO డాక్టర్ అప్పయ్య అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉండటం ఆందోళనకరమని తెలిపారు. 14 ఏళ్లలోపు బాలికలు కచ్చితంగా టీకాలు వేయించుకోవాలన్నారు.