MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తల గురించి పొందుపరిచిన రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా కార్యకర్తలు కోరారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వినతిపత్రం అందజేశారు. మార్చి 16 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో చర్చించి ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
HYD: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KNR: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. కరీంనగర్‌కు విచ్చేసిన ఆయనకు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయపాల్ రెడ్డి, స్వాగతం పలికారు.
ADB: బహుజన రాజ్య స్థాపన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం కావాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లాధ్యక్షుడు గణేష్ మహారాజ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాన్యశ్రీ కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలను పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఎస్పీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న తొలిదశ జనగణనపై కలెక్టరేట్లో శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, ఛార్జ్ లెవల్ ఇంఛార్జులకు దిశానిర్దేశం చేశారు. ఎన్యూమరేటర్‌లు, సూపర్ వైజర్ల నియామక ప్రక్రియపై సూచనలు చేశారు. 3 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
WGL: నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన సంకటి భాస్కర్, ప్రసాద్ తండ్రి సంకటి మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA దొంతి మాధవరెడ్డి ఆదివారం మృతుడు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 13వ వార్డు కౌన్సిలర్ ముళ్లపాటి విజయ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చిన్నారుల చేత ఓనమాలు దిద్దించి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. నేటి బాలలే రేపటి పౌరులని కౌన్సిలర్ తెలిపారు.
SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేసిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారన్నారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అండగా నిలిచాడన్నారు.
WNP: దేశంలో దాదాపు 15 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న జన గణన-2027 అత్యంత ముఖ్యమైనదని, దీని ఆధారంగానే దేశ అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని, అందువల్ల ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణకు ఆయన హాజరై జిల్లా చార్జ్ స్థాయి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
PDPL: రామగుండం మున్సిపల్ చౌరస్తా సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న యాష్ లారీ టూ వీలర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంటనే స్పందించి, ట్రాఫిక్ ఎస్సై హరి శేఖర్ సహాయంతో గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
RR: బహుజన సాహిత్య అకాడమీ 18వ ఆల్ ఇండియా రైటర్స్ వేదిక సమావేశంలో చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్లోళ్ల హనుమంత్ రెడ్డి జాతీయ సేవారత్న అవార్డును అందుకున్నారు. తిరుపతిలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతులమీదుగా అవార్డు అందుకున్నట్లు వారు పేర్కొన్నారు.
SRD : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో గల శ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో ఆదివారం నిర్వహించిన జాతర మహోత్సవంలో పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జీఎంఆర్‌ను ఘనంగా సన్మానించారు.
NZB: జల్సాల కోసం ఆటో చోరీ చేసిన దొంగను ఆదివారం అరెస్టు చేసినట్లు NZB 5వ టౌన్ SI ఎం.గంగాధర్ తెలిపారు. నగరంలోని నెహ్రూ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ నయీమ్ తాగుడికి బానిసై చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. మద్యానికి డబ్బులు లేకపోవడంతో RR చౌరస్తా వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో పార్క్ చేసిన ఆటోను దొంగతనం చేసి నాందేడ్‌కు తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు.
KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ ఎడవల్లి వనజ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నరేష్ పాల్గొన్నారు.
WGL: గీసుగొండ(M)కొమ్మాల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం నర్సంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ-రామానంద్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.