MLG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం (నేడు) మేడారం సందర్శనకు వస్తున్నారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మేడారం మాస్టర్ ప్లాన్ అమలు, పెండింగ్ పనుల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక్కడి హరిత హోటల్లో రాత్రి బస చేస్తారు. ఆదివారం మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు.
MNCL: కాసిపేట మండల కేంద్రంలోని KGBV ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. అనంతరం వంటశాలను పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎస్ఓ సరితను ఆదేశించారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు గదుల పనులు పరిశీలించారు.
MDK: సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జిల్లాలో ఘనంగా వీడ్కోలు పలికారు. శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ వీడ్కోలు సమావేశం నిర్వహించింది. జిల్లాను రోల్ మోడల్‌గా నిలిపేందుకు విశేషంగా కృషి చేశారన్నారు.
MDCL: ప్రశాంతతకు మరో పేరుగా హబ్సిగూడలోని వీరరాజా రెడ్డి పార్కు నిలుస్తుంది. సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ఉద్యానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఒకేసారి 500 మంది యోగా చేసుకునే వీలుందని, స్థానిక ప్రజలందరూ సాయంత్రం, ఉదయం సమయాల్లో ఈ పార్కులో గడిపి, మానసిక సంతోషాన్ని, యోగ ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరచుకోవాలని అధికారులు సూచించారు.
WGL: చారిత్రక భద్రకాళి ఆలయంలో ఉత్తరాయణం శుక్లపక్షం సందర్భంగా శనివారం అర్చకుడు శేషు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యార్చన, షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూలైన్‌లలో వేచి ఉండి దర్శనం చేసుకుంటున్నారు.
MDK: జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణంలో కోట్ల రూపాయల విలువైన భూమికి 15 లక్షలు చెల్లించి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రామాయంపేటకు చెందిన బైరం అర్జున్ నరసమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, బహిరంగ మార్కెట్ ధరతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
MBMR: ఢిల్లీలోని జేఎన్యూ (JNU)లో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడిని నిరసిస్తూ పాలమూరు యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఎ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా, భరత్ మాట్లాడుతూ.. దాడులకు బాధ్యత వహిస్తూ వీసీ శాంతిశ్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
SRCL: రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదలకు దూరంగా ఉండాలని చందుర్తి సీఐ వేంకటేశ్వర్లు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఆరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహన దారుడు సామాజిక భాధ్యతగా రోడ్డు భద్రత, ట్రాపిక్ నియమాలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహ నాలు నడపకూడదన్నారు.
ASF: కాగజ్ నగర్‌లోని ఖదీం మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో MLC దండే విఠల్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ శిక్షణతో నిత్య జీవితంలోనూ సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ వేడుకలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
WNP: శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మూలమంత్ర హవనం, అనంతరం శేషవాహనంపై తిరువీధి సేవ నిర్వహించనున్నట్లు అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి దర్శనం చేసుకోవాలని వారు కోరారు.
వనపర్తి జిల్లా తెల్లరాళ్లపల్లి తాండలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అద్భుతమైన ఆలయం నిర్మించడం హర్షణీయమని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, సోమనాథ్ నాయక్ తదితరులు ఉన్నారు.
BDK: అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న మౌలిక వసతుల లోపాలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సేవల నాణ్యత, మౌలిక వసతులపై నిన్న ప్రజా భవన్‌లో సమీక్ష నిర్వహించారు. పక్కా భవనాలు, ప్రహరీలు, మరుగుదొడ్లు వసతులపై సమీక్షించారు.
నిర్మల్ రాచరిక వైభవాన్ని భావితరాలకు అందించేందుకు మున్సిపల్ పాలకవర్గం కట్టుబడి ఉందని ప్రకటించింది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్ వారసత్వ కట్టడాలను పరిరక్షించనున్నట్లు తెలిపింది. శ్యామ్‌గఢ్, బత్తీస్‌గఢ్, ఖిల్లాగుట్ట వంటి చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
RR: స్వర్ణ భారతి ట్రస్ట్ ముచింతల్‌లో 2026 నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఐదు రోజుల శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సంగెం సర్పంచ్ గన్నోజు వేణుగోపాల్ రంగారెడ్డి జిల్లా డీపీవో చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ అందుకున్నారు. అనంతరం డీపీవోని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి నేర్చుకున్న విషయాలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
KMR: బాన్సువాడలో జనసేన ఇన్‌ఛార్జ్ రవీందర్ చౌహన్ పట్టణంలోని గౌలిగూడ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి జనసేన సభ్యత్వాన్ని ప్రారంభించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడికి రూ.ఐదు లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారం దిశగా అడుగులు వేస్తామన్నారు.