• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

VKB: కుల్కచర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లికి చెందిన వడ్డే రమేశ్(22) అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

March 15, 2026 / 05:00 PM IST

టీజేఎస్ ప్లీనరీపై సమావేశం

MDCL: తెలంగాణ జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సూచన మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో అల్వాల్ చౌరస్తాలోని జయశంకర్ సార్ విగ్రహం వద్ద ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈనెల 29న నిర్వహించనున్న పార్టీ ప్లీనరీపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భద్రగమ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఏర్పుల దయాకర్, తదితరులు ఉన్నారు.

March 15, 2026 / 04:54 PM IST

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండకింద కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.

March 15, 2026 / 04:49 PM IST

గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా రైతు పోరాటం

వనపర్తి జిల్లాల్లో గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ల నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాట సమితి చేపట్టిన ధర్నా 77వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరానికి రోజురోజు ప్రజాదరణ ఉందని అన్నారు. ప్రజా ఆమోదం లేకుండా రైతుల భూములను లాక్కోవడం అన్యాయమని, ఏదుల రిజర్వాయర్ అందుబాటులో ఉండగా కొత్త రిజర్వాయర్ల అవసరం లేదని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

March 15, 2026 / 04:48 PM IST

‘విద్యాశాఖకు అందించిన సేవలు మరువలేనివి’

NLG: నకిరేకల్ లోని శకుంతల ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఉపాధ్యాయుడు సామంతపురి మురళి ఉద్యోగ విరమణ సన్మానోత్సవంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా మురళి విద్యాశాఖకు అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సమాజానికి మార్గదర్శకంగా పదవీ విరమణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.

March 15, 2026 / 04:48 PM IST

పిల్లుట్ల గ్రామంలో కార్మికులకు సన్మానం

MDK: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పిల్లుట్ల (MPW) వర్కర్స్ సన్మాన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బుర్ర మురళీ గౌడ్ నిర్వహించారు. ఉప సర్పంచ్ గొల్ల స్వామి, కాంగ్రెస్ యువ నేత బాసంపల్లి నర్సింల్లు, పిల్లి సుధాకర్, కమ్మరి వినయ్, కమ్మరి శివశంకర్, కమ్మరి రాము తదితరులు పాల్గొన్నారు.

March 15, 2026 / 04:44 PM IST

కామారెడ్డిలో ఘనంగా కాన్షిరాం జయంతి వేడుకలు

KMR: తెలంగాణ BC, ST, SC JAC ఛైర్మన్ డా.విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు బహుజన సిద్ధాంతకర్త, రాజకీయ నేత మాన్య శ్రీ కాన్షిరాం 92వ జయంతిని KMR జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించినట్లు జిల్లా నాయకుడు భువనశ్వర్ తెలిపారు. సందర్భంగా BC,ST,SC JAC జిల్లా నాయకులు బోలేశ్వర్ మాట్లాడుతూ.. భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను మార్పుకు నాంది పలికిన సామాజిక–రాజకీయ మేధావి కాన్షిరాం అన్నారు.

March 15, 2026 / 04:41 PM IST

డివిజన్ పరిధిలో పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్‌లో ఎన్నికలకు ముందు పెండింగ్‌లో ఉన్నటువంటి పలు పనులను డివిజన్ కార్పొరేటర్ సరస్వతి మూస నరేందర్ ఆదివారం పరిశీలించారు. ఎస్సీ కాలనీలోని పెండింగ్‌లో ఉన్న పోచమ్మ దేవాలయాన్ని పరిశీలించి పనులను పునః ప్రారంభించినట్లు వెల్లడించారు. డివిజన్ అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు.

March 15, 2026 / 04:39 PM IST

గ్రామపంచాయతీ కార్మికులకు ఘన సన్మానం

NGKL: కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాల గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందిని సర్పంచ్ కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల గ్రామ అభివృద్ధిలో జీపీ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. గ్రామానికి పట్టుకొమ్మలు కార్మికులు అన్నారు.

March 15, 2026 / 04:38 PM IST

ఆదివాసీ సంస్కృతి దేశానికే గర్వకారణం: కలెక్టర్

ADB: ఆదివాసీ సంస్కృతి దేశానికే గర్వకారణం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండీ ధర్మగురువు హీరాసుక్కా బాబా జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివాసీ యువత విద్యపై దృష్టి సారించాలని సూచించారు.

March 15, 2026 / 04:36 PM IST

‘లక్షెట్టిపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తా’

MNCL: లక్షెట్టిపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ. 3.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇటిక్యాల చెరువు సుందరీకరణ పనులను ఆయన ప్రారంభించారు. మున్సిపాలిటీ సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి, తదితరులు ఉన్నారు.

March 15, 2026 / 04:36 PM IST

ముకుందంపూర్‌లో కార్మికులకు సన్మానం

NRPT: ముకుందంపూర్ గ్రామంలో ప్రభుత్వ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను సర్పంచ్ తిరుమలేష్ సన్మానించారు. గ్రామ శుభ్రత కోసం శ్రమిస్తున్న కార్మికులకు శాలువాలు కప్పి గౌరవించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొని కార్మికుల సేవలను అభినందించారు.

March 15, 2026 / 04:34 PM IST

పారిశుధ్య కార్మికులకు PPE కిట్ల పంపిణీ

MDK: పట్టణ పారిశుధ్య కార్మికుల ఆరోగ్యమే మున్సిపాలిటీ ప్రథమ ప్రాధాన్యతని మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ‘ప్రజా ప్రగతి ప్రణాళిక’ (99 రోజుల కార్యాచరణ)లో భాగంగా ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు PPE కిట్ల పంపిణీ ,ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం కార్మికులకు రక్షణ కవచాలను PPEకిట్లు అందజేశారు.

March 15, 2026 / 04:34 PM IST

‘చిన్నకిష్టాపూర్ స్టేజీ వద్ద బస్టాండ్ నిర్మించాలి’

SDPT: కుకునూరుపల్లి మండల పరిధిలోని చిన్నకిష్టాపూర్ గ్రామ క్రాస్ రోడ్డు వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మించాలని కోరుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ.. త్వరలోనే నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

March 15, 2026 / 04:33 PM IST

దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి: రవి పటేల్

BHPL:చిట్యాల(M)చెందిన ఆకుతోట కుమారస్వామిపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం బాధితుని నివాసానికి వెళ్లి పరామర్శించారు. రవి పటేల్ మాట్లాడుతూ.. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని, బీసీలకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు

March 15, 2026 / 04:33 PM IST