SRPT: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా ముస్లిం సోదరులకు, ప్రజలకు ఎస్పీ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పండుగను మతాలకు అతీతంగా, సోదరభావంతో జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వక వాతావరణంలో మెలిగి సమాజంలో శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.