JN: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలోని మస్జిద్లో సోమవారం సాయంత్రం సర్పంచ్ చింత ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని మతాలు సర్వసమానంగా జీవిస్తున్నాయని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా, షాదీ ముబారక్, మైనారిటీ రుణాలు అందించేవారని కొనియాడారు.