JGL: ధర్మపురి పట్టణంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ మాట్లాడుతూ.. దక్షిణ కాశిగా పేరుగాంచిన ధర్మపురికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. పట్టణంలో చెత్తను నిల్వ చేసేందుకు డంప్ యార్డ్ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ దుర్వాసన వస్తుందన్నారు.