MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్నేహ శబరీష్‌ను సోమవారం డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, కురవి మండల BRS సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్పంచుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ను మాజీ MLA కోరారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.