• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఘనంగా శివస్వాముల మహాపడి పూజోత్సవం

RR: చేవెళ్ళ మండలం నాంచేరి గ్రామంలో శివ స్వాముల మహా పడి పూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బీజేపీ మండల అధ్యక్షులు అత్తెలి అనంత్‌రెడ్డి శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆ కార్యక్రమంలో నాయకులు, కార్యర్తలు, శివస్వాములు, స్థానిక భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

February 21, 2025 / 07:40 PM IST

ఎమ్మెల్సీ కవితను కలిసిన మాజీ ఎమ్మెల్యే

పెద్దపల్లి: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాదులో BRS మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్ఛం అందజేశారు. పెద్దపల్లి జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి స్రవంతి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

February 21, 2025 / 07:18 PM IST

కరీంనగర్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు

KNR: వికసిత భారత్‌లో భాగంగా 2025-26 కేంద్ర బడ్జెట్‌పై ఇవాళ కరీంనగర్లో మేధావుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగిడి కృష్ణారెడ్డి, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరీ జయశ్రీ, తదితరులు పురందీశ్వరికి స్వాగతం పలికారు.

February 21, 2025 / 06:58 PM IST

‘విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలి’

NZB: ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక కాలంలో పిల్లలకు మమతను రాగాలు, బాంధవ్యాలు అనేవి తెలియకుండా పోతున్నాయని వాటిపై అవగాహన కల్పించామని వారు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించాలని సూచించారు.

February 21, 2025 / 06:29 PM IST

10వ తరగతి పరీక్షలకు రంగం సిద్దాం

NLG: మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, భువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినీ మీటింగ్ హాల్‌లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షల కోసం జిల్లాలో 50 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

February 21, 2025 / 05:18 PM IST

సిద్దిపేట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి

SDPT: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని జూన్ మొదటి వారం‌లోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులపై ఆరా తీశారు.

February 21, 2025 / 03:29 PM IST

అర్హత మేరకు రైతులకు వ్యవసాయ రుణాలు

SDPT: అర్హత మేరకు రైతులకు వ్యవసాయరుణాలు అందించాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హరిబాబు బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సిద్ధిపేట కలెక్టరేట్‌లో సిద్దిపేట బ్లాక్ 16మండలాలు, 3మున్సిపాలిటీలకు సంబంధించి జాయింట్ మండల బ్యాంకర్ల కమిటీ త్రైమాసిక సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అన్ని ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.

February 21, 2025 / 03:24 PM IST

భారీ మెజారిటీతో గెలిపించండి: ఎంపీ నగేష్

NRML: బైంసా పట్టణంలో నిర్వహించిన బీజేపీ అభ్యర్థుల ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసే అంజి రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.

February 21, 2025 / 02:03 PM IST

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

SRD: చౌటకూరు మండలం చక్రియాల్ గ్రామంలోని అంగన్వాడి, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యువ నాయకులు చిన్న గొల్లపాటి రాజశేఖర్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాన్ని వమ్ము చేయకుండా లక్ష సాధనతో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

February 21, 2025 / 01:43 PM IST

వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ షాప్స్ బంద్

WNP: ఆత్మకూరు, మదనాపురం మండాలాల పరిధిలోని పిన్నంచర్ల గ్రామంలో 3 రోజుల్లోనే 450 కోళ్లకు పైగా మృతి చెందాయి. సమాచారం మేరకు జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారులు కోళ్ల షెడ్డును పరిశీలించారు. కోళ్ల నుంచి నమూనాలను సేకరించారు. ల్యాబ్‌ నుంచి వచ్చే నివేదిక వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారించే అవకాశం ఉందన్నారు.

February 21, 2025 / 01:01 PM IST

మంటల్లో చిక్కుకొని మహిళ మృతి

SRCL: చెత్త అంటుపెడుతూ ఓ మహిళ మంటల్లో చిక్కుకొని మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం చిన్ని అంజవ్వ(52) చెత్తను కాల్చివేస్తుండగా, మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. మృతురాలికి భర్త బాల్ రెడ్డి, ఇద్దరు కూతుళ్ళు భాగ్య, భవానిలు ఉన్నారు.

February 21, 2025 / 12:49 PM IST

ఆలయ ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భక్త మార్కండేయ మహా దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, DCC ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డిలకు ఇవాళ ఖేడ్‌లో పద్మశాలి సంఘం, కుల పెద్దలు, వైదిక పురోహితులు గురురాజు శర్మ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. 3 మంచి ఆరో తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు.

February 21, 2025 / 12:48 PM IST

కొత్త మండలాల కోసం ఎదురుచూపులు

NRPT: జిల్లాలోని 3 గ్రామాల ప్రజలు సీఎం మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోటకొండ, గార్లపహాడ్, కానుకుర్తీలను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఇంఛార్జ్‌ కుంభం శివకుమార్ రెడ్డి ఇటీవల పర్యటనలో సీఎం నోటి వెంట కొత్త మండలాల ప్రకటన చేయిస్తామని హామీ ఇచ్చారు.

February 21, 2025 / 12:44 PM IST

సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన

SRD: కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో అకౌంటెంట్ ఏఎన్ఎం పోస్టుల కోసం సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, వహిద్ పాషాలు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.

February 21, 2025 / 12:34 PM IST

క్రికెట్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్

JGL: జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులో బాక్స్ క్రికెట్ చిల్డ్రన్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 21, 2025 / 12:29 PM IST