SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. స్వామి వారికి 19 రోజుల్లో రూ.78,31,047 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. 82 గ్రాముల మిశ్రమ బంగారం, 5 కిలోల 100 గ్రాముల మిశ్రమ వెండి, 130 విదేశీనోట్లు, మిశ్రమబియ్యం 13 క్వింటాళ్లు వచ్చాయన్నారు.
NZB: రోడ్లపై ధాన్యాలు ఆరబోస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి హెచ్చరించారు. ఎర్ర జొన్న కోతలు అవుతున్న నేపథ్యంలో రోడ్లపై ధాన్యాన్ని ఆరవేయొద్దని సూచించారు. దాన్ని అన్ని రోడ్లపై ఆరేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సూచించారు. గ్రామ రోడ్లపై, జాతీయ రహదారులపై ధాన్యాన్ని ఆరబోస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సూచించారు.
NZB: నవీపేట మండలం అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పక్క సమాచారం మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా మల్కాపూర్ పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
KMR: దేశంలో ఢల్లీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని మాజీ MP BB పాటిల్ అన్నారు. నేడు MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ప్రశ్నించడానికి బీజేపీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.
KMR: జిల్లా కేంద్రంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ జిల్లా సెమినార్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కామ్రేడ్ పాలడుగు సుధాకర్ హాజారయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పేదలకు, కార్మిక వర్గానికి ఎలాంటి కేటాయింపులు దక్కలేదన్నారు.
KMR: పిట్లం మండలంలోని తిమ్మా నగర్, మార్దండ, కంబాపూర్ గ్రామాలలోని నర్సరీలు, కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, అవెన్యూ ప్లాంటేషన్లను ఇవాళ పిట్లం మండల ఎంపీడీవో కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శిలకు పలు సూచనలు చేశారు. వేసవి కాలం దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
KMR: జిల్లాలోని దేవునిపల్లి పీఎస్ వద్ద ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్కును మల్టీ జోన్-1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్ఐ రాజు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, చిన్న పిల్లలు ఉన్నారు.
NGKL: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, తదితర సమస్యలపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా పేరెంట్స్ జాగ్రత్త వహించాలన్నారు.
WGL: జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్‌తోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పీడీఎస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. గతంలో రవాణాకు పాల్పడిన వారితోపాటు ప్రస్తుతం రవాణాకు పాల్పడుతున్న వారి సమాచారాన్ని సేకరించి రేషన్ బియ్యం రవాణా కట్టడి చేశారు.
MBNR: రేపు నారాయణపేటకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీంతో కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తారని గ్రామ వాసులు ఆశతో ఉన్నారు. గత నెలలో కోటకొండ మండలం ఏర్పాటు చేయాలని దీక్షలు చేయగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివకుమార్ రెడ్డి సీఎం వచ్చినప్పుడు ప్రకటన చేస్తారని వారికి హామీ ఇచ్చారు. దీంతో వారి ఆశలు ఫలిస్తాయని ఆకాంక్షిస్తున్నారు.
NRPT: రేపు నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి కోరారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించబోతున్న సీఎంకి ఘనంగా స్వాగతించేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ADB: ఆదిలాబాద్‌లోని ఓ ఛానెల్లో పనిచేస్తూ అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన కంచు సుభాష్ కుటుంబానికి జర్నలిస్ట్ JAC ఆర్థిక సాయం అందించింది. మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవడానికి జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ కలిసి రూ.52,100 నగదు జమచేసి వాటిని గురువారం సుభాష్ భార్యకు అందించారు.
NRML: లక్ష్మణ్చందా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డిఇఓ రామారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పది పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల పలు అనుమానాలను నివృత్తి చేశారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం పోచమ్మ గడ్డ వద్ద కొనసాగుతున్న చెత్త డంపింగ్ యార్డ్ వెంటనే తరలించాలని లేనిపక్షంలో ఆటో డ్రైవర్లందరం రహదారిపై బైఠాయించి ధర్నా చేపడతామని ఆటో యూనియన్ అధ్యక్షుడు రామ్ కుమార్ గురువారం హెచ్చరించారు. వారు మాట్లాడుతూ.. నిత్యం వేలాదిమంది ప్రజలు, విద్యార్థులు ప్రయాణిస్తుంటారని దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
PDPL: సింగరేణి సంస్థ ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికుడు ఊరగొండ రాజకుమార్ గురువారం ఉదయం కలవచర్ల గ్రామంలోని భోక్కల వాగు బ్రిడ్జిలో పడి మరణించాడు. పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిలో ఈ దుర్ఘటన జరిగినది. మంథని సీఐ రాజు, ఎస్సై దివ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.