• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సమావేశం

JGL: గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై జగిత్యాల నియోజకవర్గ బీజేపీ సమీక్ష సమావేశం నిర్వహించింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా గెలిపించాలో చర్చించారు. ఈ సమీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ హరి, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2025 / 12:27 PM IST

ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నేతలు

MDK: నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకై ప్రతి ఒక్కరూ తమ ఓటును వేయాలని సూచించారు. అంజిరెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వారు తెలిపారు. అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

February 21, 2025 / 12:21 PM IST

యాసంగి పంటలపై రైతులకు అవగాహన

MDK: నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో వ్యవసాయ అధికారులు రైతులకు యాసంగి పంటలపై తగు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. వరి కోత కోసే సమయంలో హార్వెస్టర్ ఫ్యాన్ యొక్క వేగం 18 – 20 ఆర్పీయం ఉంచడం ద్వారా గింజలు రాలడం తగ్గించవచ్చన్నారు. దాన్ని ముందుగానే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. తేమ 17% ఉండేటట్లు చూడాలన్నారు.

February 21, 2025 / 12:19 PM IST

రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి

MDK: గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన ఘటన నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో జరిగింది. తెల్లవారుజామున వల్లూరు కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు చిరుత ప్రయత్నించింది. అయితే వేగంగా వెళ్తున్న ఓ వాహనం చిరుతను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

February 21, 2025 / 12:16 PM IST

బైకును ఢీకొన్న కంటైనర్.. వ్యక్తి మృతి

నల్గొండ: మిర్యాలగూడెం నందిపాడు చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వచ్చి బైకును, నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కంటైనర్ డ్రైవరు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.

February 21, 2025 / 11:56 AM IST

‘విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి’

SRPT: కోదాడ మండలంలోని గురుకుల పాఠశాలలను ఇవాళ మండల విద్యాధికారి సలీం షరీఫ్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన ఎలా పెడుతున్నారు. అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పాఠశాల పరిసరాలను పరిశీలించారు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు.

February 21, 2025 / 11:45 AM IST

‘బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి’

KMR: ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి కోరారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

February 21, 2025 / 11:19 AM IST

జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

NRML: పట్టణంలోని బంగాల్‌పేట్ కాలనీలో శుక్రవారం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థులైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య, పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

February 21, 2025 / 10:07 AM IST

కారు ఢీకొనడంతో మహిళ మృతి

KMR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డిలో జరిగింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. శాబ్దిపూర్ గ్రామానికి చెందిన యశోద కామారెడ్డిలోని ఓ గోదాం పక్కన నిలబడి ఉంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు.

February 21, 2025 / 09:22 AM IST

మంచి నీటి సమస్యపై తండాలో గ్రామస్తుల ఆందోళన

SRD: తమ గ్రామంలో మంచినీటి ఎద్దడి నెలకొందని, మిషన్ భగీరథ నీరు రావడంలేదని సిర్గాపూర్ మండలం సుర్త్యాతాండ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయని శంకర్, భీమ్ రావు, తదితరులు ఆవేదనతో తెలిపారు. గత వారం రోజుల నుండి నిల్వ ఉన్న ఉంచిన నీటిని సేవిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య తీర్చాలని కోరారు.

February 21, 2025 / 08:17 AM IST

నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం

SRD: డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు నిర్వహిస్తున్న డీఎం మల్లేశయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు 90634 17161 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 21, 2025 / 08:07 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

KMR: డోంగ్లీ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ నెల 27న నిర్వహించే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు తహశీల్దార్ రేణుక చౌహన్ తెలిపారు. మండలంలో పట్టభద్రులు పోలింగ్ స్టేషన్ నం. 163లో 107 మంది ఓటర్లు, ఉపాధ్యాయుల కోసం పోలింగ్ స్టేషన్ నం. 107లో 11 మంది ఓటర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు.

February 21, 2025 / 06:59 AM IST

ఈనెల 24 న అద్దె వాహనాల లక్కీ డ్రా: GM

BDK: ఈ నెల 24న సా.4 గంటలకు GM కార్యాలయంలో అద్దె వాహనాలకు లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని ఏరియా GM వి. కృష్ణయ్య ప్రకటనలో తెలిపారు. టెండర్లు వేసిన వారి సమక్షంలోనే లక్కీ డ్రా నిర్వహించి టెండర్ దారులను ఎంపిక చేస్తామన్నారు. టెండర్లు వేసిన అభ్యర్థులందరూ సకాలంలో లక్కీ డ్రా కు హాజరు కావాలని తెలిపారు.

February 21, 2025 / 06:57 AM IST

లంకా సాగర్ నుంచి కట్లరుకు నీరు వదలాలి: సీపీఎం

KMM: ఎర్రుపాలెం మండలం సీపీఎం పార్టీ మండల కమిటీ, రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం మామునూరు గ్రామ వరి, మొక్కజొన్న పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు దివ్వెల వీరయ్య మాట్లాడుతూ.. రైతు సమస్యల పట్ల సంబంధిత అధికారులు స్పందించి లంకా సాగర్ నుంచి కట్లరు నదికి నీరు వదలాలని డిమాండ్ చేశారు.

February 21, 2025 / 06:09 AM IST

ఆర్డీఓ విచారణ చేపట్టిన నివేదిక కలెక్టర్‌కు అందజేస్తాం

SRD: కంగ్టిలో గిరిజన సంక్షేమ కళాశాల వసతిగృహంలో విద్యార్థులు అల్పహారం తయారు చేయడంపై జిల్లా కలేక్టర్‌ వల్లూరు క్రాంతి నారాయణఖేడ్‌ ఆర్డీఓ అశోక్‌ చక్రవర్తికి విచారణకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్టీఓ కళాశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థులకు, సిబ్బందికి అడిగి తెలుసుకొన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్ సమర్పించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు.

February 21, 2025 / 05:51 AM IST