SDPT: వేసవిలో ఎండ వేడిమికి దాహార్తితో అల్లాడుతున్న పక్షులకు చిన్నారులు తమవంతు సాయం అందిస్తున్నారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్ కు చెందిన చిన్నారులు అకిరా నందన్, అద్వైత్, కొబ్బరి చిప్పలతో పక్షులకు నీరు అందిస్తున్నారు. ఇంటి ముందు పెరటి తోటలో చల్లని నీటిని అందిస్తూ పక్షుల ప్రాణాలు కాపాడుతున్నారు. చిన్నారుల సేవ గుణం చూసి పలువురు పిల్లలను ప్రశంసిస్తున్నారు