MDK: నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో శనివారం రూ.7 లక్షల వ్యయంతో ప్రధాన రోడ్డుకు సీసీ రోడ్డు పనులను సర్పంచ్ బత్తుల స్వప్న ప్రారంభించారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, ఉపసర్పంచ్ రామచంద్రం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.