MNCL: బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏప్రిల్ 7న మంచిర్యాలలో 24 గంటల నిరవధిక దీక్ష చేపట్టనున్నట్లు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా దేశంలో బీసీ ఉద్యమాలు నడుస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.
VKB: మోమిన్‌పేట్ మండలం కేసారం గ్రామంలో విషాదం నెలకొంది. భూమి తన పేరు మీద మార్చలేదన్న మనస్తాపంతో నాగరాజు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఉరివేసుకొన్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
VKB: మోమిన్‌పేట్ మండలం కేసారం గ్రామంలో విషాదం నెలకొంది. తండ్రి భూమి తన పేరు మీద మార్చలేదన్న మనస్తాపంతో నాగరాజు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఉరివేసుకొన్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
KMM: నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన రైతు చూడితో ఉన్న గేదె అనారోగ్యం పాలవగా రాజేశ్వరపురం పశువైద్యశాలకు తీసుకువచ్చాడు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో తన కింద స్థాయి వైద్యుడు చికిత్స చేశాడు. అతనికి వచ్చి రాని వైద్యంతో వైద్యం చేయాగా గేదె మృతి చెందింది. సకాలంలో వైద్యుడి చేత వైద్యం అందితే తన గేదె చనిపోయి ఉండేది కాదు అని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
MBNR: మహబూబ్‌నగర్ 2-టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాహనదారులు పెండింగ్ చలాన్లను వెంటనే చెల్లించాలి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. వాహన పత్రాలు (ఆర్‌సీ) తమ వెంటే ఉంచాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
SDPT: బిఆర్ఎస్ సర్పంచులపై స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ వివక్ష చూపుతున్నారని అక్కన్నపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భూక్య కృష్ణ నాయక్ ఆరోపించారు.బిఅర్ఎస్ మద్దతుతో గెలిస్తే మాపై ఎందుకింత వివక్ష చూపుతున్నారో తెలియదని,గ్రామాల అభివృద్ధికి అధికారులు సైతం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
NLG: దేవరకొండ మున్సిపాలిటీలోని 20వ వార్డులో సీసీ రోడ్ల పనులు గత రెండు రోజులుగా వేగంగా సాగుతున్నాయి. శనివారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు పనులను పర్యవేక్షించారు. ఆమె మాట్లాడుతూ.. వార్డులోని ఐబీ వెనక స్వర్ణకార్ వీధి లోపల ఇరువైపులా రోడ్లు నిర్మించబడుతున్నట్లు చెప్పారు. నాణ్యతతో పనులను త్వరగా పూర్తి చేయనున్నారు.
NZB: పరస్పర రాజీతో కోర్టు కేసులకు శాశ్వత పరిష్కారం సాధించవచ్చని మొదటి అదనపు జిల్లా జడ్జి హర్ష తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీ దుర్గా ప్రసాద్, బార్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
NGKL: మూగజీవాలకు వస్తున్న గాలికుంటు వ్యాధుల నివారణకు మందులు పంపిణీ చేస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ నాగార్జున తెలిపారు. కల్వకుర్తి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో శనివారం మూగజీవాలకు గాలికుంటు వ్యాధి టీకాలను ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూగ జీవికి గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని సూచించారు.
SDPT: కోహెడ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి JSR ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత చల్లటి త్రాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ మేరకు గ్రామ ఉపసర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. బాటసారులకు ప్రయాణికులకు ఈ చలివేంద్ర కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
PDPL: జిల్లాలో పదో తరగతి గణితం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జీ.శారద తెలిపారు. మొత్తం 7,495 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,486 మంది పరీక్ష రాయగా, 9 మంది గైర్హాజరయ్యారు. 99.9 శాతం హాజరు నమోదవడం గమనార్హమని పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
SRCL: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మండిపడ్డారు. ఈరోజు ‘ఛలో హైదరాబాద్’ ఇందిరాపార్క్ మహాధర్నాను భగ్నం చేయాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ శనివారం పర్యటించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోడసం భూపతి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న గజేందర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MNCL: ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మంచిర్యాలలో లెర్నింగ్ స్టడీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు రెండో రోజు శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. సర్వేకు జిల్లాలో నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
GDWL: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం గద్వాలలోని విశ్వేశ్వరయ్య, విశ్వభారతి పాఠశాలల కేంద్రాలను తనిఖీ చేశారు. వైద్య శిబిరాలు, మౌలిక వసతులు ఉండేలా చూడాలని సూచించారు. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్‌తో తరలించి, జవాబుపత్రాలను తపాలా కార్యాలయంలో భద్రపరచాలని తెలిపారు.