ADB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని బోథ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆడే గజేందర్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇవాళ తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.