NRML: బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఇవాళ జిల్లా కన్సాలిటేటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించు వివిధ రుణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు అందించు రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదన్నారు.