NLG: గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో సీట్లు సాధించిన మైనంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సాత్విక్, వర్షిత, హన్వీక్‌లను గ్రామ సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ నేడు ఘనంగా సన్మానించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మికి కూడా ప్రత్యేక గౌరవం లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
HYD: సెంట్రల్ యూనివర్సిటీ M.A కమ్యూనికేషన్స్ అలుమ్ని మున్సిఫ్ వెంకట్‌కు ప్రతిష్టాత్మకత దక్కింది. రామ్నాథ్ గోయంక ఇన్ జర్నలిజం అవార్డును బిజినెస్ & ఎకనామిక్ జర్నలిజంలో అందుకున్నారు. ఈ అవార్డును ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అందజేసినట్లు HCU తెలిపింది. ఆయన చేసిన రాయిటర్స్ దర్యాప్తు దేశవ్యాప్తంగా మహిళల ఉపాధిపై చర్చకు దారి తీసింది.
SRD: బీటి రోడ్డును తొలగించి మట్టిరోడ్డుగా మార్చారని నారయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. సిర్గాపూర్‌లో నేడు BRSనాయకులు,కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.నారయణఖేడ్ నుంచి సిర్గాపూర్ వరకు డబుల్ లైన్ రోడ్డుకు గత BRS హయాంలోనే రూ 15.కోట్లు మంజూరు చేశామన్నారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ రోడ్డు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.
MDCL: MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ అనుపురం కాలనీని పరిశీలించి, రోడ్ల పక్కన ఉన్న చెత్త, కేబుల్స్‌ను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు మార్జిన్లు వారానికి ఒకటి లేదా రెండుసార్లు శుభ్రం చేయాలని సూచించారు. నిర్మాణ దశలోనే డివియేషన్లు గుర్తించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిపారు.
BDK: దమ్మపేట మండలంలో అంకమ్మ తల్లి తిరునాళ్లు శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటి మాట్లాడుతూ.. అంకమ్మ తల్లి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంగా వర్ధిల్లాలని వేడుకున్నట్లు తెలిపారు.
JGL: వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి, అనేక చారిత్రక గ్రంథాల రచయిత, ఉపన్యాస కేసరి, KCR గురువు డా. జైశెట్టి రమణయ్య అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇవాళ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రమణయ్య సేవలను ఆయన స్మరించుకుంటూ వారి మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.
WGL: నల్లబెల్లి మండలం మేడేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను గ్రామ కార్యదర్శి అనిల్ లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడం లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
RR: గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ దోమల బెడదపై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నిధులతో వంద రోజుల దోమలపై యుద్ధం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, వివేకానంద నగర్ కాలనీలో చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. నగరంలో దోమల బెడదతో కంటికి కునుకు ఉండటం లేదని, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.
MNCL: సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇవాల బెల్లంపల్లి శాంతిఖని గని ఆవరణలో TBGKS ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్‌హాకు వినతిపత్రం అందజేశారు. కొన్ని నెలలుగా బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యంతో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
BDK: రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం శనివారం కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఇళ్లు పూర్తి చేసి, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇళ్ల పనులు పూర్తి చేసి పేదలకు కేటాయించాలని అలాగే పట్టణాల్లోని పేదలకు వారి సమీప ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
NLG: చిట్యాల మండలం ఏపూరులోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఎస్‌బీఐ పాన్ ఇండియా సీఎస్‌ఆర్ యాక్టివిటీస్‌లో భాగంగా ప్రీస్కూల్ మెటీరియల్‌ను శనివారం పంపిణీ చేశారు. మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ఛైర్మన్ లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఈడీ టీవీ, రైస్ కుక్కర్, ఆటవస్తువులు, పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ క్రాంతి కుమార్, సర్పంచ్ మహేష్ పాల్గొన్నారు.
NLG: నకిరేకల్ సమీపంలోని చందంపల్లి బస్ స్టేజీ వద్ద NH-65 హైవే రోడ్డు పక్కన ‘ఇంద్రాస్ ఫ్లాష్ బిగ్గెస్ట్’ పేరిట భారీ EV ఫాస్ట్ చార్జింగ్ కేంద్రానికి భూమిపూజ చేశారు. కేవలం రూ.16కే ఒక్క కిలోవాట్ చార్జింగ్ అందించి వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడమే తమ లక్ష్యమని నిర్వహకులు తెలిపారు. 1250 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ కేంద్రం ఒక్క నెలలో ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
NZB: బాల్కొండ మండలం బోదేపల్లిలో శనివారం ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అంకితకు రూ.43,500, భూమన్నకు రూ.42,000, గంగాధర్‌కు రూ.15,500 విలువైన చెక్కులను గ్రామ నాయకులు పంపిణీ చేశారు. చెక్కుల మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరటి శ్రీనివాస్, కాంగ్రెస్ పాల్గొన్నారు.
HYD: ఓవైపు కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వ స్థలాల కబ్జాలు ఆగడం లేదు. తాజాగా బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్-10లో జలమండలికి చెందిన స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నించారు. ప్రహరీ గోడను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. విషయాన్ని తెలుసుకున్న బంజారాహిల్స్ వార్డు జలమండలి మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కబ్జాకు సంబంధించి రెండు FIRలు నమోదు అయ్యాయి.
PDPL: సింగరేణి RG-2 ఏరియా పరిధిలోని 2వ బొగ్గు గనిపై TBGKS ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికుల సమస్యలు, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.