WNP: పానగల్ మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందుతున్న వైద్య సేవలపై గ్రామీణ ప్రాంతా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బి.రామయ్య అన్నారు. పానగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సాధారణ కాన్పుల సంఖ్యను పెంచాలని ఆయన వైద్యులకు సూచించారు. 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
WNP: 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆదివారం జిల్లాలో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతం గాముగిశాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 9 పరీక్షా కేంద్రాలలో 5,047 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,904 మంది విద్యార్థులు హాజరయ్యారు. 147 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మర్రికుంటలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
SRD: జిల్లాలో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు జిల్లా 28 నుంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, మార్చి 4 నుంచి 6 వరకు ఉన్నత పాఠశాల టీచర్లకు, మార్చి 10 నుంచి 12 వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఉంటుందన్నారు.
SRD: ప్రముఖ సంఘ సంస్కర్త, వాగ్గేయకారుడు స్వచ్ఛ భారత్ పితమహుడు సంత్ గాడ్గే బాబా 150వ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రం ఐలమ్మ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ పాల్గొన్నారు.
SRD: నిజాంపేట మండలం బాచేపల్లి గ్రామానికి చెందిన కర్రే లచ్చవ్వ ఇటీవల మరణించారు.. అయితే ఈమె పేరున ఉన్న రైతు బీమా పథకం ద్వారా రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. అయితే భీమాకు సంబంధించిన పత్రాన్ని మృతురాలి కుమారుడు సాయిలుకు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రేయారెడ్డి తదితరులు ఉన్నారు.
SRD: రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి 4వ వార్షికోత్సవం, పోచమ్మ తల్లి జాతర మహోత్సవానికి భారీగా భక్తజనం తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ఆలయానికి భారీగా భక్తజనం తరలి రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
NRML: కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గా భవాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
JGL: జిల్లాలో ఓ డిగ్రీ కళాశాల మైదానంలో పట్టభద్రుల ఓటర్లను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. నరేందర్ రెడ్డి విద్యావేత్తగా అర్హత కలిగిన అభ్యర్థి అని, విద్యార్థుల నిరుద్యోగ సమస్యలకు పరిష్కారకుడు అని అన్నారు. అల్ఫోర్స్ విద్యార్థులెందరో ఉన్నట్లు గుర్తు చేస్తూ, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సూచించారు.
SRCL: వేములవాడ మండల్ హన్మాజిపేట పాఠశాల 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా CM రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపుతూ లేఖను విడుదల చేశారు. 75ఏళ్లుగా అంకితభావం, శ్రద్ధ, పట్టుదలతో అనేక మంది విద్యార్థులకు పాఠశాల విద్యా బుద్ధులు నేర్పిందన్నారు. కవి, రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పునర్నిర్మించటం స్ఫూర్తి దాయకమన్నారు.
BDK: పినపాక నియోజకవర్గంలో రాష్ట్ర శిశు, సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదివారం పర్యటించనున్నారు. మంత్రి సీతక్క వ్యక్తిగత సతీష్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి నియోజకవర్గంలోని పలు సమస్యలను అధికారులను, ప్రజాప్రతినిధులను తెలుసుకోనున్నారు.
BDK: పోలీస్ హెడ్ క్వార్టర్‌లో జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆయన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని అధికారులకు తెలిపారు.
BDK: మార్చి 2న ప్రారంభమయ్యే ఉపవాస దీక్షల నుంచి రంజాన్ పండుగ వరకు ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అధికారులు, ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.
MBNR: మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు కావలసిన అన్ని చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో శనివారం మహిళా సంఘాల బలోపేతంపై నిర్వహించిన సీఆర్పీల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మహిళా సంఘాలకు పంచ సూత్రాలు పాటించేలా వారికి అన్ని రకాల శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించారు.
NLG: ఢిల్లీ వేదికగా జరగనున్న జీ-20 సదస్సుకు MGU తెలుగుశాఖ విద్యార్థి గణేష్ ఎంపికయ్యారు. గణేష్ పూర్వం నుంచి పర్యావరణంపై మక్కువతో NSS ఇతర సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న రీత్యా, ఫిబ్రవరి 21న HYDలో జరిగిన G-20 సదస్సు వాలంటీర్ల ఎంపికలో MG యూనివర్సిటీ ప్రాతినిధ్యం వహించాడు. పర్యావరణ పరిరక్షణపై వారు ఇచ్చే ప్రాజెక్టును అధ్యయనం చేసి సమర్పించనున్నారు.
SRCL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ఎస్సై అంజయ్య అన్నారు. రామారావు పల్లిగ్రామంలో శనివారం రాత్రి సైబర్ నేలరపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌సై మాట్లాడుతూ మొబైల్ ద్వారానే ఎక్కువ శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.