KMM: ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
BDK: చర్ల, దుమ్మగూడెం, పినపాక, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో సాగువని పోడు భూమలలో సోలార్ ప్లాంట్ నెలకొల్పి విద్యుత్‌ను సరఫరా చేసేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు ITDA APO వేణు మంగళవారం తెలిపారు. 3-4 ఎకరాలను యూనిట్‌గా గుర్తించి అందులో మూడు కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరా అవసరమయ్యే రైతులు మార్చి 3 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కి ఈనెల 26 నుంచి 28 వరకు సెలవులు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 26న మహా శివరాత్రి, 27న శివరాత్రి మరుసటి రోజు జాగారం చేసేవారికోసం, 28న అమావాస్య ఉండటంతో మూడ్రోజులు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచి మార్కెట్ తెరుచుకుంటుందన్నారు.
BDK: దుమ్మగూడెం మం. తురుబాక గ్రామం వద్ద కల్వర్ట్ ప్రమాదం వల్ల డైవర్షన్ చేసిన రోడ్డుపై ప్రతిరోజు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా వేసిన తాత్కాలిక రోడ్డుపై విపరీతమైన దుమ్ము లేచి ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు తెలిపారు. అసలు ఆ డైవర్షన్ రోడ్డు ప్రభుత్వమే వేసిందా లేదా ఎవరైనా కాంట్రాక్టర్ వేశారా? వేస్తే పూర్తిగా బీటీ రోడ్డు వెయ్యాలన్నారు.
NZB: ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి నిజామాబాద్‌కు ఓట్లు అడగటానికి వచ్చారో సమాధానం చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ దేవుళ్లపై ప్రమాణాలు చేసి ఇచ్చిన హామీలను ఏ గంగలో కలిపారని ధ్వజమెత్తారు. సిద్ధులగుట్టపై ఒట్టు పెట్టి ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.
SRPT: అనర్హులకి ఇళ్ళు మంజూరు చేయరాదని రాష్ట్ర హౌజింగ్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి వీపీ గౌతమ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం పేదవారికి ఇళ్ళు నిర్మించటం కోసం గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేయటం జరిగిందని, ఒక్క అనర్హునికి కూడా ఇళ్ళు మంజూరు చేయరాదు అన్నారు.
MDK: పాపన్నపేట మండలం నుంచి ఎల్లాపూర్ గ్రామం మీదిగా మంజీరా డ్యామ్ ప్రవహిస్తుంది. నదిపై బ్రిడ్జి నిర్మాణం బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడింది. సుమారుగా 70 సంవత్సరాలు అవుతుందని గ్రామ ప్రజలు తెలిపారు. బ్రిడ్జి పైన తారు రోడ్డు గుంతలుగా మారింది. వాహనదారులు, స్థానికులు మాట్లాడుతూ వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
NLG: త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లిలోని యువతకు సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ కిట్, క్రికెట్ కిట్, LED లైట్లను బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆదివారం పంపిణీ చేశారు. యువత క్రీడల్లో రాణించాలని శారీరకంగా మానసికంగా అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు.
SRPT: నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా మార్కెట్ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయానికి విరాళంగా రూ.50,116లు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించారు.
SRPT: చిలుకూరు మండలం సీతారామపురం స్టేజి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో లారీలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను పట్టభద్రులు గెలిపించాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సమితి జిల్లా కన్వీనర్ అడేపు లక్మి నారాయణ, ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, నరసింహా కోరారు. సోమవారం జన్నారంలో వారు మాట్లాడుతూ.. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.
NRML: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని వెంకటాద్రిపేట్‌లో గల ఓంకారేశ్వర ఆలయాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సోమవారం సందర్శించారు. ఆలయంలో పారిశుద్ధ పనులను దగ్గరుండి మున్సిపల్ సిబ్బందితో చేయించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా స్ట్రీట్ లైట్లు, నీటి సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
SRPT: జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఐతబోయిన రాంబాబు, బుక్క రాంబాబు అన్నారు. ఆ సంఘం పిలుపుమేరకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులు జానయ్య, కృష్ణ, సాయి, రూధర్, పుట్టా రాంబాబు ఉన్నారు.
ADB: పట్టణంలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బంజారుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని గజేందర్ పేర్కొన్నారు.
NLG: నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలు అందజేశారు.