నిర్మల్: గ్రామాలలో ఏర్పడే సమస్యలను పంచాయతీ కార్యదర్శులు పరిష్కరించాలని ఖానాపూర్ మండల ఎంపీడీవో సునీత సూచించారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలో పాడైన బోర్లకు తక్షణమే మరమ్మతులు చేయించాలని, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కాకుండా చూడాలన్నారు.
ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్, బరంపూర్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించాలని వారిని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.
ADB: భీంపూర్ మండలంలోని బేల్సరి రాంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూ.5 లక్షలతో ఇంటిని ఏ విధంగా నాణ్యతగా నిర్మించుకోవాలో వివరించారు. హౌసింగ్ డీఈ శంకర్, తహశీల్దార్ నలందప్రియ, ఎంపీడీవో గడ్డం గోపాలకృష్ణ రెడ్డి, హౌసింగ్ ఏఈ నజీర్, పంచాయతీ కార్యదర్శి సాయితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
BDK:దమ్మపేట మండలం దిబ్బగూడెంలో నిర్వహిస్తున్న గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం పాల్గొని ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించుకోవాలని సూచించారు.
NLG: జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే కంట్రోల్ రూం టోల్ నెంబర్ 1912కి ఫోన్ చేసి సమస్యలను తెలుపాలని ట్రాన్స్‌కో కార్యనిర్వాహణాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. NLG, MLG ,DVK డివిజన్ల పరిధిలో వ్యవసాయానికి 20 గంటలు తగ్గకుండా త్రీఫేస్ , గృహ వాణిజ్య పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి జాతర జాతర నేపథ్యంలో మంగళవారం ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉచిత బస్సులను భక్తుల సౌకర్యార్థం ప్రారంభించారు. 14 ఉచిత బస్సులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈవో వినోద్, ఆర్టీసీ డీఎం శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
KNR: ప్రైవేట్ మేనేజ్‌మెంట్, అథారిటీలలో పనిచేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ఒక ప్రకటనలో కోరారు. MLC ఎన్నికల్లో ఓటు వేసేందుకు షిఫ్టుల సర్దుబాటు, డ్యూటీ గంటల తగ్గింపు, ఆలస్యంగా హాజరుకావడానికి అనుమతి వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
KMM: బోనకల్ మండలం మోటమర్రి నుంచి మధిర మండలం సిరిపురం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర రూ. 25 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ లైన్లను మంగళవారం విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ఈ సురేంద్ర ప్రారంభించారు. రెండు మండలాలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా సరఫరా అవుతోందని చెప్పారు.
BDK: బూర్గంపాడు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం ఎస్సై నాగబిక్షం, తహసీల్దార్ ముజాహిద్ కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలోని వసతుల గురించి అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.
MNCL: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సభవిజయవంతం చేయడం పట్ల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సభకు పెద్దసంఖ్యలో హాజరైన పట్టభద్రుల ఓటర్లకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 27న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
BDK: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం కోరారు. ఈ సమయంలో రాజకీయ సభలు, సమావేశాలు కార్యక్రమాలు చేపట్టవద్దని, అభ్యంతరకరమైన రాజకీయ సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపకూడదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KMM: ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
BDK: చర్ల, దుమ్మగూడెం, పినపాక, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో సాగువని పోడు భూమలలో సోలార్ ప్లాంట్ నెలకొల్పి విద్యుత్‌ను సరఫరా చేసేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు ITDA APO వేణు మంగళవారం తెలిపారు. 3-4 ఎకరాలను యూనిట్‌గా గుర్తించి అందులో మూడు కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరా అవసరమయ్యే రైతులు మార్చి 3 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కి ఈనెల 26 నుంచి 28 వరకు సెలవులు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 26న మహా శివరాత్రి, 27న శివరాత్రి మరుసటి రోజు జాగారం చేసేవారికోసం, 28న అమావాస్య ఉండటంతో మూడ్రోజులు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు. మార్చి 1వ తేదీ నుంచి మార్కెట్ తెరుచుకుంటుందన్నారు.
BDK: దుమ్మగూడెం మం. తురుబాక గ్రామం వద్ద కల్వర్ట్ ప్రమాదం వల్ల డైవర్షన్ చేసిన రోడ్డుపై ప్రతిరోజు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా వేసిన తాత్కాలిక రోడ్డుపై విపరీతమైన దుమ్ము లేచి ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు తెలిపారు. అసలు ఆ డైవర్షన్ రోడ్డు ప్రభుత్వమే వేసిందా లేదా ఎవరైనా కాంట్రాక్టర్ వేశారా? వేస్తే పూర్తిగా బీటీ రోడ్డు వెయ్యాలన్నారు.