• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సొంత ఇంట్లోనే భారీ చోరీ

KNR: హుజూరాబాద్‌లో 2రోజుల క్రితం భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ACP శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. అప్పులు ఎక్కువై ఎలా తీర్చాలో తెలియక నాగరాజు అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై దాడి చేయించాడు. దొంగల ముఠాతో చేయి కలిపి ఇంట్లో నుంచి 70తులాల బంగారం, రూ.5లక్షలు చోరీ చేయించ్చినట్లు విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదుచేసి, ఐదుగురిని రిమాండ్‌కు తరలించామని ACP తెలిపారు.

February 26, 2025 / 07:57 AM IST

అక్రమ ఇసుక డంపులకు బహిరంగ వేలం

JGL: మల్లాపూర్(M) వెంకట్రావుపేట్ శివారులో ఈనెల 20న స్వాధీనం చేసుకున్న ఇసుకకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ వీర్ సింగ్ తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా నిల్వఉంచిన 15 ట్రిప్పుల ఇసుక డంపులకు 28వ తేదీ శుక్రవారం ఉ.11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో అధికంగా పాటపాడిన వ్యక్తులకు ఇసుక రవాణా చేసుకోడానికి అనుమతి ఇస్తామన్నారు.

February 26, 2025 / 07:29 AM IST

‘క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యం’

SRPT: టీబీ(క్షయ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని జిల్లా వైద్యాధికారి కోటా చలం కోరారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. నిక్షయ శిబిర్(వంద రోజుల్లో టీబీ నిర్మూలన)లో భాగంగా రోగులను గుర్తించి, అవగాహన కల్పించాలని సూచించారు. తెమడతో కూడిన దగ్గు రెండు వారాలకు మించి ఉంటే పరీక్షలు చేయించాలన్నారు.

February 25, 2025 / 07:23 PM IST

ఈనెల 27న పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలం

NLG: దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఈనెల 27న వేలం పాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్విచక్ర వాహనానికి రూ.10 వేలు, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.30 వేలు డిపాజిట్ చేసి 27న ఉదయం 10 గంటల లోపు పేరు నమోదు చేసుకోవాలని కోరారు.

February 25, 2025 / 06:57 PM IST

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

నిర్మల్: అప్పుల బాధతో మద్యానికి బానిసై వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దస్తురాబాద్ మండలంలో జరిగింది. మున్యాల్ గోండ్ గూడకు చెందిన పుర్క జగన్ అప్పుల బాధతో మద్యానికి బానిసై ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు జగన్‌ను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని ఎస్ఐ శంకర్ వివరించారు.

February 25, 2025 / 06:52 PM IST

పోలింగ్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

NLG: వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సెంటర్ నంబర్ 140లో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాటులను మంగళవారం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వలిగొండ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

February 25, 2025 / 06:41 PM IST

‘మైనర్ అత్యాచార ఘటనపై మంత్రి సీతక్క స్పందించాలి’

ADB: మైనర్ బాలిక అత్యాచార ఘటనపై ఇంచార్జ్ మంత్రి సీతక్క స్పందించకపోవడం సమంజసం కాదని BRS నాయకులు సాజిదోద్దీన్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో BRS నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.

February 25, 2025 / 06:12 PM IST

గోదావరిలో పుణ్యస్నానాలు ప్రారంభించిన భక్తులు

మంచిర్యాల: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని లక్షెట్టిపేట పట్టణంతో పాటు జన్నారం, దండేపల్లి మండలాల్లో ఉన్న గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ప్రారంభించారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వారు ముందుగానే పుణ్యా స్నానాలు చేస్తున్నారు.

February 25, 2025 / 05:34 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ 15 వార్డుకు చెందిన చంద్రకళ అనే మహిళ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు రూ. లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ మంజూరు అయ్యింది. ఆ చెక్కును షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేడు ఆమెకు అందజేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

February 25, 2025 / 05:24 PM IST

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ASF: వాంకిడిలో జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సందర్శించారు. అనంతరం కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

February 25, 2025 / 05:14 PM IST

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

NLG: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతిచెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్ పేటకు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్స్యగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

February 25, 2025 / 04:39 PM IST

చెట్లకు క్యూ ఆర్ కోడ్

MNCL: ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్లను కేటాయించారు. ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఆమెను అభినందించారు.

February 25, 2025 / 04:34 PM IST

‘విద్యార్థుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’

మంచిర్యాల: ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉట్నూర్ ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఉట్నూరు పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో ఉమ్మడి జిల్లాలోనీ ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడే విద్యార్థులకు మెరుగైన వైద్యం చేయాలన్నారు.

February 25, 2025 / 04:26 PM IST

సమస్యలను పరిష్కరించాలి: ఎంపీడీవో

నిర్మల్: గ్రామాలలో ఏర్పడే సమస్యలను పంచాయతీ కార్యదర్శులు పరిష్కరించాలని ఖానాపూర్ మండల ఎంపీడీవో సునీత సూచించారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలో పాడైన బోర్లకు తక్షణమే మరమ్మతులు చేయించాలని, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కాకుండా చూడాలన్నారు.

February 25, 2025 / 04:02 PM IST

‘కాంగ్రెస్ పార్టీతోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం’

ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్, బరంపూర్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించాలని వారిని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.

February 25, 2025 / 04:01 PM IST