నిర్మల్: అప్పుల బాధతో మద్యానికి బానిసై వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దస్తురాబాద్ మండలంలో జరిగింది. మున్యాల్ గోండ్ గూడకు చెందిన పుర్క జగన్ అప్పుల బాధతో మద్యానికి బానిసై ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు జగన్ను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని ఎస్ఐ శంకర్ వివరించారు.
Tags :