BDK: పినపాక నియోజకవర్గంలో రాష్ట్ర శిశు, సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదివారం పర్యటించనున్నారు. మంత్రి సీతక్క వ్యక్తిగత సతీష్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి నియోజకవర్గంలోని పలు సమస్యలను అధికారులను, ప్రజాప్రతినిధులను తెలుసుకోనున్నారు.
BDK: పోలీస్ హెడ్ క్వార్టర్‌లో జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆయన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని అధికారులకు తెలిపారు.
BDK: మార్చి 2న ప్రారంభమయ్యే ఉపవాస దీక్షల నుంచి రంజాన్ పండుగ వరకు ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. శనివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అధికారులు, ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.
MBNR: మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు కావలసిన అన్ని చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో శనివారం మహిళా సంఘాల బలోపేతంపై నిర్వహించిన సీఆర్పీల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మహిళా సంఘాలకు పంచ సూత్రాలు పాటించేలా వారికి అన్ని రకాల శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించారు.
NLG: ఢిల్లీ వేదికగా జరగనున్న జీ-20 సదస్సుకు MGU తెలుగుశాఖ విద్యార్థి గణేష్ ఎంపికయ్యారు. గణేష్ పూర్వం నుంచి పర్యావరణంపై మక్కువతో NSS ఇతర సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న రీత్యా, ఫిబ్రవరి 21న HYDలో జరిగిన G-20 సదస్సు వాలంటీర్ల ఎంపికలో MG యూనివర్సిటీ ప్రాతినిధ్యం వహించాడు. పర్యావరణ పరిరక్షణపై వారు ఇచ్చే ప్రాజెక్టును అధ్యయనం చేసి సమర్పించనున్నారు.
SRCL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ఎస్సై అంజయ్య అన్నారు. రామారావు పల్లిగ్రామంలో శనివారం రాత్రి సైబర్ నేలరపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌సై మాట్లాడుతూ మొబైల్ ద్వారానే ఎక్కువ శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
NLG: ఎన్నో ఏళ్ళుగా బీసీలు అగ్ర వర్ణాల జెండాలు అజెండాలు మోసేవారుగా ఉన్నారని బీసీల ఓటు బీసీలకు వేసి గెలిపించాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అద్యక్షులు టి.చిరంజీవులు అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎమ్మెల్సీ రవిందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని శనివారం సూర్యాపేటలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
JGL: మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో శనివారం స్వచ్ఛత ర్యాంక్ ప్రజల అభిప్రాయము స్వచ్ఛత లింకు ద్వారా తెలుసుకోవటానికి వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
మేడ్చల్: ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లోని డాక్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధిని బట్టు సంజన(15) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు విద్యార్థిని తల్లీ నీలా పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
KMM: పెనుబల్లి మండల ప్రాంతంలో అసలు ఏజెన్సీ చట్టాలు ఉన్నట్టా.. లేనట్టా అని LHPS జిల్లా అధ్యక్షులు దశరథ్ నాయక్ ప్రశ్నించారు. బంజర గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయ మాట్లాడుతూ.. అధికారులు ఏజెన్సీ చట్టాలను పక్కన పెట్టి, ఇష్టానుసారంగా బిల్డింగ్‌లకు అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. రామచంద్ర, జి.పండు నాయక్, బి.నందు. కె.కృష్ణ నాయక్, నాగరాజు నాయక్ ఉన్నారు.
PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-11 గనిలో గతేడాది జరిగిన ప్రమాదంలో మరణించిన ఇజ్జగిరి ప్రతాప్ కుటుంబ సభ్యులకు RG-1 GM లలిత్ కుమార్ చేతుల మీదుగా కాంట్రిబ్యూషన్ ₹ 10,57,128, మ్యాచింగ్ గ్రాంట్ ₹10 లక్షల చెక్కులను అందజేశారు. GM మాట్లాడుతూ గతేడాది ఘటన జరగడం బాధాకరమైన విషయమని, ఇదే క్రమంలో మృతుని కుమారునికి సంస్థలో డిపెండెంట్ సూటబుల్ ఉద్యోగం కల్పించామన్నారు.
NLG: నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామంలో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు శనివారం ఎంపీడీవో సంజీవ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. గత ఐదు నెలలుగా గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.
SRCL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే www.cybercrime.gov.in లేదా 19305కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు క్రిప్టో/బిట్ కాయిన్, పిరమిడ్/మల్టీ లెవల్ మార్కెటింగ్, జంప్డ్ డిపాజిట్ ఫ్రాడ్‌లు జరుగుతున్నాయని ఎస్పీ వివరించారు.
JGL: కథలాపూర్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిజనులతో కలసి సరదాగ ప్రభుత్వ విప్ నృత్యాలు చేశారు. ప్రజలందరీకి సంతు సేవాలాల్ 286 జయంతి శుభాకాంక్షలు తెలిపారు
KNR: హుజురాబాద్(M) జూపాక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేతిరి రాజిరెడ్డి వేములవాడ దేవస్థానం ఉత్సవ కమిటీ డైరక్టర్‌గా నియామకమైనట్లు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితల ప్రణవ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.