JGL: పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కిరణ్ ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
PDPL: జిల్లా సర్కిల్ లెవల్లో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మాధవరావు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం కమాన్పూర్ సెక్షన్ రొంపికుంట సబ్ స్టేషన్‌లో రెండు 11 కేవీ కొత్తఫీడర్ బ్రేకర్లను ఎస్ఈ మాధవరావు ప్రారంభించారు. ఎస్ఎల్ఏ అశోక్, ఎస్ఐ కృష్ణ, లైన్ మెన్ శ్రీధర్ పాల్గొన్నారు.
MBNR: రైతు క్షేమంగాఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం సబ్సిడీ కింద మంజూరైన 20 మంది రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. రానున్న వేసవి కాలంలో పంటలు ఎండిపోకూడదు అనే ఉద్దేశంతో అధికారులతో మాట్లాడి రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేశామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం పంచాయతీ రాజ్ SE సురేష్ చంద్రా రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద శర్మ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
ADB: ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ లక్ష్మణచందా, మామడ మండలాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. పట్టభద్రులు, టీచర్లను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు నారాయణరెడ్డి, పదాధికారులు, కార్యకర్తలు తదితరులున్నారు.
MNCL: బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో ఇంటిని కోల్పోయిన బాధితుడు భీమయ్య కుటుంబ సభ్యులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం పరామర్శించారు. అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి ఎంపీ హామీ ఇచ్చారు.
KMM: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. కామేపల్లి(M) క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు. వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేయాలన్నారు.
KMM: మధిర సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసు కుటుంబ సభ్యులందరూ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి కోరారు. శనివారం మధిర సీ.ఐ కార్యాలయంలో ఖమ్మంకు చెందిన శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఉచితంగా ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
MNCL: బెల్లంపల్లి పట్టణ రైల్వే స్టేషన్‌లో వికలాంగులు, వృద్ధులు, మహిళల సౌకర్యార్థం ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు చేయాలని మాజీ కౌన్సిలర్‌లు, ఎంపీ వంశీకృష్ణకి శనివారం వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు బెల్లంపల్లిలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. పట్టణంలోని రాంనగర్ అండర్ బ్రిడ్జి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
BHPL: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులు భారీగా పెరిగారు. భక్తులు ముందుగా గోదావరిలో స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేస్తున్నారు. పార్వతి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి, నవగ్రహ కాలసర్ప పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తున్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోనీ సోమనాధుని మ్యూజియంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, తాగుబోతులకు అడ్డాగా మారిపోతుందని బంజారా హక్కుల పోరాట సమితి వ్యవస్థపాక అధ్యక్షుడు బానోత్ మహేందర్ నాయక్ శనివారం పాలకుర్తి ఎమ్మార్వో ని కలిసి వినతి పత్రం అందజేశారు. శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు అందుబాటులో తేవాలని, పరిశుద్ధత పాటించాలని కోరారు.
HNK: చిల్పూర్ మండలం ఫతేపూర్, గార్లగడ్డ తండా గ్రామాల పరిధిలోని పంట పొలాలను శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పొలాల వద్దకు వెళ్లి పంట ఏవిధంగా ఉంది, సాగు నీరు అందుతుందా అనే విషయాలను ఎమ్మెల్యే రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లన్నగండి రిజర్వాయర్ వద్దకు వెళ్లి రిజర్వాయర్‌లోకి నీటి పంపింగ్‌ను పరిశీలించారు.
HNK: జిల్లా కేంద్రానికి విచ్చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలను సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హనుమకొండ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై కాసేపు అరుణతో నేతలు చర్చించారు. కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్: రాయపర్తి మండలం గన్నరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొకటి రాజు కుమారుడు మొకటి రిషి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపటి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50కేజీల బియ్యం, నూనె డబ్బాను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదిరులు పాల్గొన్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్‌లోని పలు కాలనీల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కుక్కల బెడద తీర్చాలని అధికారులకు స్థానికులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థానిక కార్పొరేటర్, అధికారుల ఆదేశాలమేరకు ప్రత్యేక బృందం ఈ రోజు వివేకానందకాలనీలో కుక్కలను పట్టుకున్నారు. డివిజన్‌లోని అన్ని కాలనీలలో కుక్కల బెడద తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.