హైదరాబాద్ (Hyderabad) నుంచి పొరుగు రాష్ట్రలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ (AC sleeper) బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
హైదరాబాద్ (Hyderabad) నుంచి పొరుగు రాష్ట్రలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ (AC sleeper) బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు హైటెక్ మోడల్లో ఈ బస్సులను రూపొందించింది. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. హైదరాబాద్‌లోని బస్ భవన్( Bus bhavan) ప్రాంగణంలో నూతన నమూనా ఏసీ స్లీపర్ బస్సును ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్( Sajjanar) పరిశీలించారు. ఈ బస్సులకు లహరి అని పేరు పెట్టారు. మార్చి నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్లీపర్ బస్సులను విశాఖపట్టణం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హుబ్బళ్లి నగరాలకు నడిపించనున్నారు. కాగా, టీఎస్ఆర్టీసీ ఇటీవల నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తి స్లీపర్ బస్సులను తీసుకొస్తోంది. లహరి (Lahari) స్లీపర్ బస్సు ప్రత్యేకతలివే..12 మీటర్ల పొడవుండే బస్సులో కింద 15, పైన 15 చొప్పున మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్‌కు సెల్‌ఫోన్ చార్జింగ్ సదుపాయం, వాటర్ బాటిల్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. అలాగే, వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు పానిక్ బటన్ కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో దీనిని వినియోగించవచ్చు. బస్సులో వై-ఫై ( Wi-Fi) సదుపాయం, భద్రత కోసం రెండు సీసీ కెమెరాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించగలిగే ఫైర్ డిటెక్షన్ సిస్టం కూడా ఈ బస్సుల్లో ఉంటుంది.
ప్రయాణికులకు నాణ్యమైన సేవలను అందించేందుకు తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి వస్తాయి. బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. pic.twitter.com/EWy4aDk2NJ