తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి చిల్లరగా మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని సలహా ఇచ్చారు.
KTR : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి చిల్లరగా మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని సలహా ఇచ్చారు. తన సవాల్‌కు స్పందించి మల్కాజ్‌గిరిలో గెలిచి తన దమ్మేంటో నిరూపించుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలిస్తేనే మగాడా.. ఓడిపోతే మగాడు కాదా ? నా సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదు. మల్కాజ్‌గిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు మగాడో తేల్చుకుందాం రా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. మా అయ్య పేరు కేసీఆర్. నేను ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చా. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అంతేగానీ రేవంత్‌రెడ్డిలాగా రాంగ్ రూట్లో రాలేదు. ఆంధ్రోళ్ల బూట్లు నాకి, పార్టీ మారి రేవంత్ సీఎం అయ్యారు.
కారు కూతలు మానుకోవాలి. సీఎంలాగా హుందాగా మాట్లాడాలి. మేడిగడ్డలో 85పిల్లర్లు ఉంటే అందులో మూడంటే మూడే కుంగిన మాట వాస్తవం. అంతేకానీ కాళేశ్వరం, మేడిగడ్డ కొట్టుకుపోలేదు. మూడు నెలల సమయంలో ఈ ప్రభుత్వానికి పిల్లర్లు బాగు చేసే సమయం దొరకడం లేదా?. ఈ నెల 17వ తేదీ వరకు ఓపిక పడతాం. కాంగ్రెస్ పాలన వంద రోజులు అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తాం. గొర్రె కసాయివాడ్ని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మారు. రుణమాఫీ చేయకపోతే రైతులు కాంగ్రెస్ భరతం పడతారని ఆయన హెచ్చరించారు. ని కేటీఆర్ హెచ్చరించారు.