హైదరాబాదీ (Hyderabadi) బిర్యానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫెమాసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశీయులు సైతం భాగ్యనగర్ బిర్యానీ (Biryani) అంటే ఎంతో ఇష్ట్రం పడుతారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్నబిర్యానీ రుచి మరెక్కడా లభించదంటే అతిశయోక్తి కాదు. ఇంత స్పెషాలిటీ ఉన్న హైదరాబాదీ బిర్యానీని నగర ప్రజలు లొట్టలేసుకుని లాగించేస్తారు.ఇక, ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) లేటెస్ట్ రిపోర్డ్ ప్రకారం బిర్యానీలు లాగించడంలో హైదరాబాదీల తర్వాతే ఎవరైనా అని తెలిపింది. గత ఆర్నెల్లలో హైదరాబాదులో 72 లక్షల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయట.
గత 12 నెలల్లో 1.52 కోట్ల బిర్యానీలు కుమ్మేశారట. 2022తో పోల్చితే గత ఐదు నెలల్లో బిర్యానీ ఆర్డర్ల సంఖ్యలో 8.39 శాతం వృద్ధి నమోదైందని స్విగ్గీ తెలిపింది.7.9 లక్షల ఆర్డర్లతో దమ్ బిర్యానీ (Dum biryani) అగ్రస్థానంలో ఉండగా, 5.2 లక్షల ఆర్డర్లతో మినీ బిర్యానీ రెండో స్థానంలో ఉందని తెలిపింది.హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది బిర్యానీయే. దమ్ బిర్యానీకి కేరాఫ్ అడ్రస్ లాంటి హైదరాబాద్ లో 15 వేల రెస్టారెంట్లు వివిధ రకాల బిర్యానీలు వండి వడ్డిస్తున్నాయి. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్, రొయ్యలు, మష్రూమ్స్, మొఘలాయి, కాశ్మీరీ… ఇలా ఎన్నో రకాల బిర్యానీలతో హైదరాబాద్ పేరు ప్రపంచపటంలో నిలిచిపోతుంది.హైదరాబాద్లో 15,000 కంటే ఎక్కువ రెస్టారెంట్(Restaurant)లు తమ మెనూలలో బిర్యానీని అందజేస్తుండటంలో ఆశ్చర్యకరం. కూకట్పల్లి, మాదాపూర్, అమీర్పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్ & దిల్సుఖ్నగర్(Dilsukhnagar)లలో అత్యధికంగా బిర్యానీ అందించే రెస్టారెంట్లు ఉన్నాయి.