రాష్ట్రంలో వర్షాలు (Rains) మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad), మెదక్ (Medak) జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉన్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ (Khairatabad),మెహదీపట్నం, నాంపల్లిలో భారీ వర్షాలు పడుతున్నాయి.భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు (Employees) వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
రోడ్లపై ట్రాఫిక్ (Traffic) కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో రెండు, మూడు రోజులు తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Dept) తెలిపింది.స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరో రెండు, రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. మరోవైపు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు(Kadem project)కు వరద నీరు పోటెత్తుతుండటంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.