»Several Trains Are Cancelled Up To September 11th 2023 Vijayawada Division
Alert: సెప్టెంబర్ 11 వరకు పలు రైళ్లు బంద్
ఏపీ(AP)లో ప్రతిరోజు రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సెప్టెంబర్ 11 వరకు పలు రైళ్లను(trains) రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సెఫ్టీ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లో పలు రైళ్ల(trains) రద్దుపై దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడ సెక్షన్లో సేఫ్టీ నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. ఈ రద్దులు సెప్టెంబర్ 3 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రకారం విశాఖ-లింగంపల్లి రూట్లలో 9వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. లింగంపల్లి-విశాఖపట్నం రైలు ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేయబడింది. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గుంటూరు నుంచి రాయగడ వెళ్లే రైలును రద్దు చేశారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు రాయగడ నుంచి గుంటూరు వెళ్లే రైలు 17244 బంద్ చేశారు.
ఇక విజయవాడ-విశాఖపట్నం రైలు అనకాపల్లి వరకు మాత్రమే నడుస్తుందని, విశాఖపట్నం-విజయవాడ రైలు ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అనకాపల్లి నుంచి బయలుదేరుతుంది. తిరుపతి-విశాఖపట్నం రైలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సామర్లకోట వరకు మాత్రమే వెళ్తుందని, విశాఖపట్నం-తిరుపతి రైలు ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సామర్లకోట నుంచి బయలుదేరుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖపట్నం రైలు, సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు విశాఖ-మచిలీపట్నం రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతోపాటు విశాఖపట్నం-గుంటూరు రైలును ఈనెల 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను 5,6,8,9 తేదీల్లో రద్దు(cancel) చేస్తున్నట్లు ప్రకటించారు.