»A Three Story Building Collapsed In Uttar Pradeshs Barabanki Two Members Died
Building collapsed: కుప్పకూలిన మూడంస్తుల భవనం..ఇద్దరు మృతి
ఓ మూడంతస్తుల భవనం అర్ధరాత్రి ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మృత్యువాత చెందగా..అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకి(Barabanki)లో చోటుచేసుకుంది.
janasena party alliance with bjp in telangana assembly elections 2023
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి(Barabanki)లో సెప్టెంబర్ 3న అర్ధరాత్రి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకు 12 మందిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.