బిఆర్ఎస్ గద్వాల (Gadvala)ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు (High Court) స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ (Telangana) హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. డీకే అరుణ(DK Aruna)ను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది.ఈమేరకు గెజిట్ (Gazette) విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ (EC) ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే అరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు (Bank accounts) వెల్లడించకపోవడం తప్పేనని కృష్ణమోహన్ రెడ్డి న్యాయవాది (Lawyer) అంగీకరించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు(Supreme Court).. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.