KMM: నగర శివారు వెలుగుమట్ల రెవిన్యూ గ్రామంలో భూధాన్ భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసె వాసులకు బీఆర్ఎస్ పార్టీ ద్వారా సహాయ కార్యక్రమాలు ప్రతి రోజు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలైన అంబేద్కర్ భవన్, టీటీడీసీ కేంద్రాల్లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం బాధితులకు ఆహారం అందజేశారు.