NGKL: సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకమని విమర్శించారు. అంబేడ్కర్ చౌరస్తాలో కట్టెల పొయ్యితో వినూత్న ధర్నా నిర్వహించారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుల జీవన వ్యయం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.