భూపాలపల్లిలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇల్లందు క్లబ్లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉగాది పురస్కారాలు-2026, “సంజీవనము” పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు, ఎస్పీ సంకీర్త్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి హాజరై ఉగాది పురస్కారాలను అందజేశారు.