భద్రాద్రి: సాగుకు పనికిరాని, నీటి వనరులు లేని భూముల్లో రైతులు పీఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రెడ్కో మేనేజర్ పి.అజయ్ కుమార్ తెలిపారు. రైతులు సమయానికి దరఖాస్తు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని సూచించారు.