JGL: కథలాపూర్ మండలంలోని సిరికొండలో ట్రాన్స్కో ఆధ్వర్యంలో ‘విద్యుత్ ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఏఈ దివాకర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వైర్లు తెగితే సొంతంగా మరమ్మతులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఈ మేరకు సిబ్బందితోనే పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్, సిబ్బంది పాల్గొన్నారు.