SRPT: సూర్యాపేట మండల పరిధిలోని ఇవాళ సాయంత్రం శాంతినగర్ సమీపంలో గల ఖాళీ స్థలంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో ఇళ్లు, దుకాణాలు ఉన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.