MNCL: బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల COE విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ శుక్రవారం తెలిపారు. మహబూబాద్ పట్టణంలో ఈనెల 7 తేది నుంచి 9వ తేది వరకు రాష్ట్రస్థాయి అండర్ 14 సాఫ్ట్ బాల్ పోటీలలో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.