MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ జాబ్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. సినోక్యూల్ రీసెర్చ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో 43 మంది విద్యార్థులు పాల్గొనగా.. 10 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారికి నెలకు రూ. 20,000 వేతనంతో నియామక పత్రాలు అందజేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు.